భారతదేశంలో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. పాత వాహనాల వాడకాన్ని తగ్గించడం, రోజువారీ అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం వంటి చర్యల వల్ల కాలుష్యం తగ్గించడానికి మన వంతు ప్రయత్నం చేయవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఎక్కువ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పొల్యూషన్ ఎక్కువగా ఉండే సిటీల్లో దిల్లీ వంటి నగరాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా సమస్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. కాలుష్యాన్ని తగ్గించడానికి సాధారణ ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల వాడకాన్ని తగ్గించడం, రోజువారీ అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం వంటి చర్యల వల్ల కాలుష్యం తగ్గించడానికి మన వంతు ప్రయత్నం చేయవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్నో కంపెనీల EVలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ కార్ల జాబితా.. మీ కోసం...
1. Tata Nexon EV
Tigor EVని అందుబాటులోకి తీసుకువచ్చిన తరువాత, కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన టాటా నెక్సాన్ ఈవీని టాటా మోటార్స్ విడుదల చేసింది. ఇటీవల పుణెలోని కంపెనీ ప్లాంట్ నుంచి నెక్సాన్ EV 1000 వ యూనిట్‌ను విడుదల చేసింది. కేవలం ఆరు నెలల్లోనే టాటా మోటార్స్ ఈ ఘనత సాధించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్, ఆసక్తిని ఈ నంబర్లు సూచిస్తున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో టాటా మోటార్స్ అమ్మిన మొత్తం ఈవీలలో 62 శాతం వాటా నెక్సాన్ ఈవీదే కావడం విశేషం. ఈ మోడల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది. మోడల్‌ను బట్టి టాటా నెక్సాన్ ఈవీ ధరలు రూ.13.99 లక్షల నుంచి రూ.15.99 వరకు ఉన్నాయి.
2. MG ZS EV
భారతదేశంలో ఎంజీ సంస్థ విడుదల చేసిన హెక్టర్ ఎస్‌యూవీ విజయవంతం అయిన తర్వాత, ఆ సంస్థ జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో ఫ్రంట్ వీల్ వద్ద థ్రీ ఫేజ్ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారును అమర్చారు. జెడ్ ఎస్ ఎస్‌యూవీలో ఉండే 44.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 143PS పవర్ను, 353Nm టార్కును అందిస్తుంది. ఈ కారు కేవలం 8.5 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకోగలదని ఎంజీ సంస్థ పేర్కొంది. 15 యాంపియర్ వాల్ సాకెట్‌లోకి ప్లగ్ ఇన్ చేసి, సుమారు 18 గంటల్లో ZSను పూర్తిగా రీఛార్జ్ చేయవచ్చు. ఆరు నుంచి ఎనిమిది గంటల్లో కారు బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేయగల 7.4 కిలోవాట్ల ఎసి హోమ్ ఛార్జర్‌ను కంపెనీ ఉచితంగా ఇన్‌స్టాల్ చేస్తుంది. వీటితో పాటు ఎంజి 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్‌లను దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచింది. దీని ద్వారా కేవలం 50 నిమిషాల్లోనే కారు బ్యాటరీని 80 శాతం ఛార్జ్ చేయవచ్చు.
3. Hyundai Kona Electric
హ్యుందాయ్ మోటార్ ఇండియా Kona Electric వేరియంట్‌ను భారతదేశంలో రూ.25.30 లక్షలకు విడుదల చేసింది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని తగ్గించిన తరువాత, హ్యుందాయ్ దీని ధరను 23.71 లక్షలకు తగ్గించింది. కోన ఎలక్ట్రిక్ భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా పేరొందింది. దీంట్లో 39.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది 134 బిహెచ్‌పి పవర్‌ను, 395 ఎన్ఎమ్ టార్కును అందిస్తుంది. ఈ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కారుకు రెండు ఛార్జర్‌లను సంస్థ ఉచితంగా అందిస్తుంది. వీటిలో వాల్ మౌంట్ ఎసి ఛార్జర్ కూడా ఉంది. కేవలం 54 నిమిషాల్లోనే ఎస్‌యూవీని 80 శాతం వరకు ఛార్జ్ చేసే డిసి ఫాస్ట్ ఛార్జర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
4. Mercedes-Benz EQC
మెర్సిడెస్ బెంజ్ EQC వేరియంట్ ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు, సేఫ్టీ, స్పేస్, కంఫర్ట్ వంటివి వినియోగదారులను ఆకట్టుకుంటాయి. రానున్న రోజుల్లో EQC సిరీస్ నుంచి మరిన్ని ఈవీలు అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో మొట్టమొదటి లగ్జరీ EV ఈ EQCనే కావడం విశేషం. ఈ ఎస్‌యూవీలో 80 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్లలో ఉండే రెగ్యులర్ హౌస్ సాకెట్ ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. మెర్సిడెస్ బెంజ్ ఉచితంగా అందించే వాల్ బాక్స్ ఛార్జర్ సాయంతో ఈ కారు బ్యాటరీని 10 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి కారును కేవలం 90 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. EQC కారు 408 హెచ్‌పి పవర్‌ను, 760 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5.1 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకోగలదు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, CAR, Cars