Home /News /business /

TOP EDUCATION LOANS PROVIDERS IN INDIA FOR STUDYING ABROAD MK

Childrens day 2021: పిల్లల ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకుంటున్నారా...అయితే ఇది మీ కోసం...

Childrens day 2021

Childrens day 2021

మిగతా రుణాలతో పోలిస్తే వీటిని తక్కువ వడ్డీ రేట్లకే అందించడం విశేషం. ఇలా తక్కువ వడ్డీకే విద్యా రుణాలు అందిస్తున్న బ్యాంకుల్లో.. బ్యాంక్​ ఆఫ్​ బరోడా, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా వంటివి ముందు వరుసలో ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    దేశవిదేశాల్లో ఉన్నత విధ్యనభ్యసించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ప్రతిభ ఉన్నా సరే, ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది ఉన్నత విద్యకు దూరమవుతుంటారు. అటువంటి వారికి చేయూతనిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. వారి కోసమే ప్రత్యేకంగా విద్యా రుణాలను అందిస్తున్నాయి. అంతేకాదు, మిగతా రుణాలతో పోలిస్తే వీటిని తక్కువ వడ్డీ రేట్లకే అందించడం విశేషం. ఇలా తక్కువ వడ్డీకే విద్యా రుణాలు అందిస్తున్న బ్యాంకుల్లో.. బ్యాంక్​ ఆఫ్​ బరోడా, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా వంటివి ముందు వరుసలో ఉన్నాయి. ఈ బ్యాంకులు మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి. ఈ మూడు బ్యాంకుల్లో కెల్లా బ్యాంక్​ ఆఫ్​ బరోడా అతి తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తూ అగ్రస్థానంలో నిలిచింది. ఈ బ్యాంకు కేవలం 6.75 శాతం వడ్డీ రేటుకే విద్యా రుణం అందిస్తుంది.

    యూనియన్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా 6.8 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం వడ్డీరేటుతో విద్యా రుణాలు అమలు చేస్తున్నాయి. కేవలం భారత్​లోనే కాదు విదేశాల్లో చదువుకోవడానికి సైతం ఈ బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. పదో తరగతి తర్వాత చేసే కోర్సులన్నింటికీ ఈ విద్యారుణాలు అందుబాటులో ఉంటాయి. కాగా, 2021 మే 20 నాటికి అన్ని బ్యాంకు వెబ్‌సైట్ల నుంచి సేకరించిన డేటా విశ్లేషించి బ్యాంక్​బజార్ ఈ వడ్డీ రేట్ల డేటా వెల్లడించింది. రూ .20 లక్షల మొత్తంపై 7 ఏళ్ల వ్యవధితో ఆయా బ్యాంకులు అమలు చేస్తోన్న వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని ఈ డేటాను ప్రచురించింది. విద్యార్థి తీసుకున్న అసలు, వడ్డీ రేటు ఆధారంగా నెలవారీ EMI లెక్కించబడుతుంది. నెలవారీ ఈఎంఐ లెక్కింపులో ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను పరిగణలోకి తీసుకోరు.

    విద్యా రుణాలపై పన్ను ప్రయోజనాలు..
    భారతదేశం, విదేశాల్లో ఉన్నత చదువుల కోసం రుణాలు తీసుకునే వారు అనేక పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఇటువంటి వారికి సెక్షన్ 80 ఈ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. చెల్లించాల్సిన వడ్డీకి ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఎనిమిది సంవత్సరాల వరకు లేదా మొత్తం తిరిగి చెల్లించే వరకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. మీరు మీ కోసం లేదా మీ జీవిత భాగస్వామి లేదా పిల్లల కోసం విద్యా రుణం తీసుకున్నట్లయితే.. మీరు చెల్లించే వడ్డీ మొత్తంపై ఈ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Bank loan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు