Best Cars Under 7 lakhs: మీ కారు బడ్జెట్ రూ.7 లక్షలా...అయితే బెస్ట్ మోడల్స్ ఇవే...

(ప్రతీకాత్మక చిత్రం)

కార్ల తయారీ సంస్థలు వినియోగదారుల కోసం ఆసక్తికరమైన ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్టున్నాయి. ఈ సీజన్‌లో కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్న కార్లలో రూ.7 లక్షల లోపు ధర ఉన్న టాప్-10 కార్ల జాబితా..

  • Share this:
    7 లక్షల బడ్జెట్లో టాప్‌-10 కార్లు :  కార్ల తయారీ సంస్థలు వినియోగదారుల కోసం ఆసక్తికరమైన ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్టున్నాయి. ఈ సీజన్‌లో కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్న కార్లలో రూ.7 లక్షల లోపు ధర ఉన్న టాప్-10 కార్ల జాబితా...

    Kia Sonet

    కియా సోనెట్ ధర రూ.6.7 లక్షలు. అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్ల జాబితాలో ఇది ఒకటి. పట్టణ ప్రాంతాల వినియోగదారులు ఈ ఎస్‌యూవీపై ఆసక్తి చూపుతున్నారు. ఫీచర్లతో పాటు ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కియా సోనెట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

    Hyundai Venue

    హ్యుందాయ్ వెన్యూ కారు ధర రూ.6.75 లక్షలు. సోనెట్ మోడల్‌కంటే ఈ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. iMT ట్రాన్స్‌మిషన్‌తో పాటు సరికొత్త ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్‌లతో వెన్యూ కారును హ్యుందాయ్ రూపొందించింది.

    Maruti Suzuki Swift

    మారుతి సుజుకి సంస్థ నుంచి వచ్చిన స్విఫ్ట్ కారు ధర రూ.5.19 లక్షలు. దీంట్లో మంచి ఫీచర్లు ఉన్నాయి. కానీ స్విఫ్ట్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌తో మాత్రమే లభిస్తుంది. దీంట్లో మాన్యువల్, AMT ట్రాన్స్మిషన్ ఆప్షన్లను కస్టమర్లు పొందవచ్చు.

    Maruti Suzuki Baleno

    మారుతి సుజుకి నుంచి వచ్చిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనో. దీని ధర రూ.5.63 లక్షలు. బాలెనో కూడా కేవలం పెట్రోల్ ఇంజిన్‌తోనే లభిస్తుంది. దీంట్లో మ్యాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను వినియోగదారులు ఎంచుకోవచ్చు.

    Maruti Suzuki S-Presso

    ఎస్-ప్రెస్సో కారును మారుతి సుజుకి ఒక ఎస్‌యూవీగా పరిచయం చేసింది. దీని ధర రూ.3.70 లక్షలు. మారుతి సుజుకి సంస్థ నుంచి వచ్చిన ఆహ్లాదకరమైన కార్లలో ఇది ఒకటి.

    Maruti Suzuki Dzire

    మారుతి సుజుకి డిజైర్ కారు ధర రూ.5.89 లక్షలు. సంస్థ నుంచి వచ్చిన స్విఫ్ట్ మోడల్ సిరీస్‌లో డిజైర్ కారును రూపొందించారు. ఈ సెడాన్ కారులో క్యాబిన్ స్పేస్, బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటాయి.

    Tata Altroz

    టాటా ఆల్ట్రోజ్ ధర రూ.5.44 లక్షలు. బాలెనో మోడల్‌కు పోటీగా దీన్ని టాటా సంస్థ విడుదల చేసింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

    Tata Nexon

    టాటా కంపెనీ నుంచి వచ్చిన ఎస్‌యూవీ నెక్సాన్. దీని ధర రూ.6.99 లక్షలు. కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ కార్లతో ఇది పోటీ పడుతోంది.

    Honda Amaze

    ఈ జాబితాలో ఉన్న మరో సెడాన్ కారు హోండా అమేజ్. దీని ధర రూ.6.19 లక్షలు. దీని అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఆకట్టుకునే ఫీచర్లతో అమేజ్ కారును రూపొందించారు.

    ఈ వీడియో చూడటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి...






    Renault Triber

    రెనాల్ట్ ట్రైబర్ ధర రూ.5.12 లక్షలు. దీన్ని భారత్‌లో విడుదల చేసిన తరువాతే గ్లోబల్ మార్కెట్లకు అందుబాటులో ఉంచారు. ఇది 7 సీటర్ కారు.
    Published by:Krishna Adithya
    First published: