హోమ్ /వార్తలు /బిజినెస్ /

Top 5 SUVs: త్వరలో భారత మార్కెట్లోకి రానున్న టాప్-5 SUVలు ఇవే.. లిస్టులో టాటా, మహీంద్రా లాంటి దిగ్గజ కార్లు 

Top 5 SUVs: త్వరలో భారత మార్కెట్లోకి రానున్న టాప్-5 SUVలు ఇవే.. లిస్టులో టాటా, మహీంద్రా లాంటి దిగ్గజ కార్లు 

MG Astor

MG Astor

విజయదశమి, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని తమ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. కరోనా కారణంగా SUVల విడుదల వాయిదా పడింది. దీంతో ఎస్‌యూవీ మార్కెట్‌ను పురోగమింపజేసేందుకు పలు సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏయే SUVలు ఈ పండుగ సీజన్‌లో విడుదల కానున్నాయో చూద్దాం.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆటో రంగం తిరిగి పుంజుకుంటోంది. దీంతో ఆటో కంపెనీలు తమ వాహనాలను లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. విజయదశమి, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని తమ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. కరోనా కారణంగా SUVల విడుదల వాయిదా పడింది. దీంతో ఎస్‌యూవీ మార్కెట్‌ను పురోగమింపజేసేం దుకు పలు సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏయే SUVలు ఈ పండుగ సీజన్‌లో విడుదల కానున్నాయో చూద్దాం.

మహీంద్రా ఎక్స్‌యూవీ 700..

ఈ వాహనం కోసం వినియోగదారులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. మహీంద్రా సంస్థ కూడా కస్టమర్ల అంచనాలకు తగిన విధంగానే త్వరలో దీన్ని విడుదల చేయనుంది. ఈ కారులో ఆటో బూస్టర్ హెడ్ ల్యాంప్స్, పనోరమిక్ సన్ రూఫ్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, సేఫ్టీ అలర్టులు, డ్రైవర్ డ్రౌసినెస్ డిటెక్షన్ లాంటి ఫీచర్లను పొందుపరిచింది. ఈ వాహనం లాంచ్ అయ్యే తేదీని కంపెనీ వెల్లడించలేదు. అయితే కొన్ని వేరియంట్ల ధరలను బహిర్గతపరిచింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎంఎక్స్ వెర్షన్ ధర రూ.11.99గా పేర్కొంది. ఇది 5-సీటర్, మ్యానువల్ కాన్ఫిగరేషన్ తో రానుంది.

టాటా పంచ్..

ఇటీవల కాలంలో కొత్త కార్లను విడుదల చేసిన టాటా మోటార్స్ త్వరలో పంచ్ అనే ఎస్‌యూవీతో వాహన ప్రియులను పలకరించనుంది. ఈ మినీ ఎస్‌యూవీ.. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి రానుంది. ఇది 86 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది టాటా "అల్ఫా" ప్లాట్ ఫాం లో రానుంది. ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు, మెకానికల్స్ గురించి కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ వాహనం H2X.HBX డిజైన్ తో రానున్నట్లు తెలిపింది. మహీంద్రా కేయూవీ 100కు పూర్తి విరుద్ధంగా ఉండనుంది. టాటా పంచ్ మినీ ఎస్‌యూవీ ధర వచ్చేసి 5 నుంచి 8 లక్షల రేంజ్ ఉండనుంది.

వోక్స్ వాగన్ టైగ్వాన్..

సెప్టెంబరు 23న ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీని విడుదల చేయాలని వోక్స్ వాగన్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది MQB A0 IN ప్లాట్ ఫాంలో రానుంది. ఇటీవలే ఈ ప్లాట్ ఫాంలో స్కోడా కుషాఖ్ లాంచ్ అయింది. ఈ సరికొత్త వోక్స్ వాగన్ టైగ్వాన్ 1.0-లీటర్ టీఎస్ఐ పెట్రోల్, 1.5-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఫీచర్ల గురించి కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. విడుదలకు ముందే ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ 10 వేల బుకింగ్స్ ను అందుకుంది. దీని ధర రూ.10 నుంచి 16 లక్షల మధ్య ఉండే అవకాశముంది.

ఎంజీ యాస్టర్..

త్వరలో ఎంజీ మోటార్ నుంచి భారత మార్కెట్లో సరికొత్త వాహనం లాంచ్ కానుంది. అదే ఎంజీ యాస్టర్. AI బాట్, సిగ్మెంట్ ఫస్ట్ లెవల్ 2 అటానమస్ డ్రైవింగ్, పనోరమిక్ సన్ రూఫ్ లాంటి ఫీచర్లతో అందుబాటు లోకి రానుంది. 10.1-అంగుళాల ఇంఫోటైన్మెంట్ సిస్టమ్‌ను ఇందులో పొందుపరిచారు. ఇందులో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే 115 పీఎస్ పవర్, 150 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే 112 పీఎస్ పవర్, 112 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.10 నుంచి 16 లక్షల మధ్య ఉండనుంది.

సిట్రోయిన్ సీ3..

సిట్రోయిన్ సంస్థ భారత్‌లో సీ3 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇటీవలే ఆవిష్కరించింది. భారత మార్కెట్లో ఈ వాహనానికి పోటీగా హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సుజుకీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్ లాంటి కార్లు ఉన్నాయి. సీ5 ఎయిర్ క్రాస్ ఎస్‌యూవీ తర్వాత భారత్ లో విడుదల కానున్న రెండో వాహనం ఇదే. ఇప్పటికే సీ3 ఐరోపా, లాటిన్ అమెరికా లాంటి అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. లాటిన్ అమెరికాలోని సీ3 మోడల్ భారత్ విడుదల కానుంది. 2022 మొదటి త్రైమాసికంలో ఈ వాహనం లాంచ్ కానుంది. దీని ధర రూ.8 నుంచి 13 లక్షల రూపాయల మధ్య ఉంటుందని అంచనా.

Published by:Krishna Adithya
First published:

Tags: Cars, Mahindra and mahindra

ఉత్తమ కథలు