TOP 5 TWO WHEELERS WITH BLUETOOTH CONNECTIVITY YOU CAN BUY IN INDIA MK GH
Bluetooth Connectivity: బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కలిగి ఉన్న టాప్ 5 బైక్స్ ఇవే!..
ప్రతీకాత్మకచిత్రం
భారత మార్కెట్లో ప్రీమియం ద్విచక్ర వాహనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే, అన్ని ద్విచక్ర వాహన సంస్థలు లేటెస్ట్ అప్డేట్ ఫీచర్లతో వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈ ప్రీమియం ఫీచర్లలో ప్రధానమైనది బ్లూటూత్ కనెక్టివిటీ.
భారత మార్కెట్లో ప్రీమియం ద్విచక్ర వాహనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే, అన్ని ద్విచక్ర వాహన సంస్థలు లేటెస్ట్ అప్డేట్ ఫీచర్లతో వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈ ప్రీమియం ఫీచర్లలో ప్రధానమైనది బ్లూటూత్ కనెక్టివిటీ. ఈ ఫీచర్ ద్విచక్ర వాహన మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ కనెక్టివిటీ ఫీచర్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌ను బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌కు సులభంగా కనెక్ట్ చేయవచ్చు. తద్వారా మీ బైక్, రైడింగ్ వివరాలను సులభంగా అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. భారత మార్కెట్లో ఈ ప్రీమియం ఫీచర్‌ను అందిస్తున్న బైక్‌లపై ఓలుక్కేద్దాం.
హీరో ఎక్స్ట్రీమ్ 200S, ఎక్స్‌పుల్స్ 200, ఎక్స్‌పుల్స్ 200T
ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్- నుండి విడుదలైన ఎక్స్ట్రీమ్ 200 ఎస్, ఎక్స్‌పుల్స్ 200, ఎక్స్‌పుల్స్ 200 టి వంటి మూడు బైక్స్‌లో బ్లూటూత్ కనెక్టివిటీని అందించారు. ఈ మూడు ద్విచక్ర వాహనాల్లో 200 సిసి మోటార్‌తో పనిచేస్తాయి. వీటిలోని- ఎల్సిడి డిస్ప్లేలో బ్లూటూత్ కనెక్టివిటీని చేర్చారు. వాహనదారుడు హీరో రైడ్ గైడ్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌తో కనెక్ట్ చేయవచ్చు. దీని సహాయంతో మీ ట్రిప్ వివరాలు, గేర్ నంబర్, కాల్ స్టేటస్, నావిగేషన్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి
ప్రీమియం విభాగంలో అత్యంత ప్రజాదారణ పొందిన బైక్‌గా అపాచీ ఆర్టీఆర్ 200 4 వికి పేరుంది. ఈ బైక్‌లో అందించిన బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో -పేరబుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కాలర్ పేరు, టాప్ స్పీడ్, ల్యాప్ టైమ్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. టీవీఎస్ బైక్ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకొని ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు.
సుజుకి యాక్సెస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్
బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్‌ను కలిగి ఉన్న సుజుకి యాక్సెస్ 125 డిస్ప్లేలో కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్, ప్రయాణ సమయం అంచనా వేయడం, కాలర్ ఐడి, ఓవర్ స్పీడింగ్ అలర్ట్‌తో పాటు ఫోన్ బ్యాటరీ లెవల్ వంటి వివరాలను చూసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు.
టీవీఎస్ Ntorq 125
ఈ బైక్‌లో ఇంజిన్ టెంపరేచర్, సర్వీస్ రిమైండర్, యావరేజ్ స్పీడ్ వంటి వివరాలను అందించే 5 -అంగుళాల LCD డిస్ప్లే ఉంటుంది. టీవీఎస్ ‘స్మార్ట్ జోనెక్ట్’ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
యమహా FZS–FI
యమహా ఇటీవల తన ప్రసిద్ధ FZS-FI మోడల్‌ను బ్లూటూత్-ఎనేబుల్డ్ డిస్ప్లేతో అప్డేట్ చేసింది. కనెక్ట్ ఎక్స్ యాప్ సహాయంతో మీ బైక్‌ను ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. యమహా యూజర్లు ‘కనెక్ట్ ఎక్స్’ అనే యాప్‌ను ఐఓఎస్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత బ్యాటరీ వోల్టేజ్, వెహికల్ లొకేషన్, యావరేజ్ స్పీడ్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. దీనిలో హజార్డ్ మోడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఏవైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటే వెంటనే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.