రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు ధోరణి పెరిగింది. అయితే దేశంలో విస్తృతమైన ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో సీఎన్జీ వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. ఇదే అదునుగా ప్రముఖ వాహన తయారీ సంస్థలు సీఎన్జీ కార్లను విడుదల చేస్తున్నాయి. ఇండియన్ టాప్ బ్రాండ్‌గా పేరొందిన మారుతీ సుజుకీ సీఎన్జీ పోర్ట్‌ఫోలియోలో అన్ని కంపెనీల కంటే ముందుంది. ప్రస్తుతం ఈ సంస్థ 11 సీఎన్జీ మోడళ్లను విక్రయిస్తోంది. మారుతీ సుజుకితో పాటు ఇతర వాహన తయారీ కంపెనీలు కూడా సీఎన్జీ వాహనాలను విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ సీఎన్జీ కార్లను పరిశీలిద్దాం.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R)
తక్కువ ధర, ఆకట్టుకునే ఫీచర్ల విషయానికి వస్తే, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ బెస్ట్ సీఎన్జీ కారుగా చెప్పవచ్చు. నెలవారీ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో వ్యాగన్ ఆర్ ముందు వరుసలో ఉంది. ఈ కారు రూ. 5.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. సీఎన్జీ -వాహనంలో 998cc పెట్రోల్ మోటారును అందించింది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సరైన డ్రైవింగ్ కండీషన్స్‌లో ఇది 32.52 km/kg మైలేజీ అందిస్తుంది. ప్రస్తుతం వ్యాగన్ ఆర్ సీఎన్జీ వెర్షన్ LXi, LXi (O) ట్రిమ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
New Rules: నవంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)
తక్కువ ధరలో మంచి సీఎన్జీ వాహనం కోసం చూస్తున్న వారికి హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ వాహనం రూ. 7.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ స్పోర్ట్స్ కారు 1.2- లీటర్ కప్పా VTVT ఇంజిన్‌తో వస్తుంది. దీనిలో రివర్స్ కెమెరా, ఏబీఎస్, ఈబీడీ, ఏసీ వెంట్లు, ఎలక్ట్రానిక్ అడ్జెస్టెబుల్ ఫ్రంట్, బ్యాక్ పవర్ విండోలు, ఆర్వీఎమ్లు వంటివి చేర్చింది. అంతే కాకుండా, 1.2 -లీటర్ పెట్రోల్ ఇంజన్ 65 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 18.9 కిమీ/కిలో మైలేజీ అందిస్తుంది.
మారుతి ఎర్టిగా (Maruti Ertiga)
ఎర్టిగా అన్ని సీఎన్జీ వాహనాల్లో బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ కారు రూ. 9.66 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. దీనిలో 7 మంది కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. దీని వెనుక భాగంలో 5 మంది కూర్చునేలా మడతపెట్టగలిగే సీట్లను అమర్చింది. ఇందులో 1.46- లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను మారుతి చేర్చింది. ఇది 91 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ARAI రేటింగ్ ప్రకారం ఇది 26.2km/kg మైలేజిని అందిస్తుంది. ఇక్కడ పేర్కొన్న అన్ని కార్లలో కెల్లా ఎర్టిగా మాత్రమే 3- స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది.
LPG Price Hike November 1: దీపావళికి బాంబు పేల్చిన గ్యాస్ సిలిండర్
మారుతి సుజుకి ఎస్ప్రెస్సో (Maruti Suzuki S-Presso)
తక్కువ ధరలో కొనగలిగే బెస్ట్ సీఎన్జీ కారుగా మారుతి సుజుకి ఎస్ప్రెస్సోను చెప్పవచ్చు. ఈ కారు రూ. 5.37 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. దీనిలో 998 సీసీ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 58 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎస్ప్రెస్సో తక్కువ కర్బ్ బరువు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. దీనిలో పార్కింగ్ సెన్సార్లు, బ్లూటూత్ సౌండ్ సిస్టమ్ వంటివి అందించింది. ఇది 32.2 km/kg మైలేజ్‌ను అందిస్తుంది.
Business ideas: డెయిరీ ఫాం బిజినెస్ట్ స్టార్ట్ చేయడం ఎలా...ఎంత ప్రాఫిట్ వస్తుంది...
మారుతి సుజుకి ఈ-ఎకో (Maruti Suzuki Eeco)
భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్లలో మారుతి సుజుకి ఈ-ఎకో కూడా ఒకటి. ఇది రూ. 5.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. ఈ సీఎన్జీ వాహనంలో 5 -మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. ఇది 1198cc పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ వాహనం 19.2km/kg మైలేజీని అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CNG, Diesel, Diesel rate, Fuel prices, Petrol, Petrol Price