TOP 5 BANKS OFFERING HIGH INTEREST ON TAX SAVING FIXED DEPOSITS THESE ARE THE INTEREST RATES MK GH
Tax-saving Fixed Deposits పై అధిక వడ్డీ అందిస్తున్న టాప్ 5 బ్యాంకులు.. వడ్డీ రేట్లు ఇవే...
ప్రతీకాత్మక చిత్రం
మార్కెట్ పరంగా చూసుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్, చిన్న బ్యాంకులు ఎఫ్డీలపై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం 6.5 శాతం వరకు వడ్డీని అందిస్తున్న టాప్ 5 బ్యాంకులను పరిశీలిద్దాం.
భారతీయ పౌరులు పొదుపును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తమ భవిష్యత్తు అవసరాల కోసం వివిధ పెట్టుబడి మార్గాల్లో పొదుపు చేస్తుంటారు. అంతేకాదు, టాక్స్ నుంచి మినహాయింపు లభించే పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తుంటారు. వాటన్నింటికీ సరిగ్గా సరిపోయేవి ఫిక్స్డ్ డిపాజిట్లు. అందుకే, మన దేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. నష్టభయం లేకపోవడం, మంచి రాబడి వస్తుండటంతో పాటు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద రూ .1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుండటం కలిసొచ్చే అంశాలు. అయితే, అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేట్లను అమలు చేయడం లేదు. కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తే.. మరికొన్ని చాలా తక్కువ వడ్డీని అమలు చేస్తున్నాయి. మార్కెట్ పరంగా చూసుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్, చిన్న బ్యాంకులు ఎఫ్డీలపై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం 6.5 శాతం వరకు వడ్డీని అందిస్తున్న టాప్ 5 బ్యాంకులను పరిశీలిద్దాం.
6.5 శాతం వరకు వడ్డీ అందిస్తున్న టాప్ 5 బ్యాంకులు..
1. ప్రైవేట్ రంగానికి చెందిన ఆర్బీఎల్ బ్యాంక్ పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అన్ని ప్రైవేట్ బ్యాంకులలోకెల్లా ఈ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ బ్యాంకులో రూ .1.5 లక్షలు ఎఫ్డీ చేస్తే.. ఐదేళ్ల తర్వాత అది రూ .2.07 లక్షలకు పెరుగుతుంది.
2. మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ యెస్ బ్యాంక్ ఎఫ్డీలపై 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. దీనిలో కూడా రూ .1.5 లక్షలు ఎఫ్డీ చేస్తే.. ఐదేళ్ల తర్వాత అది రూ .2.07 లక్షలకు పెరుగుతుంది.
3. డాయిష్ బ్యాంక్ 6.25 శాతం వరకు ఎఫ్డీపై వడ్డీ ఆఫర్ చేస్తుంది. అన్ని విదేశీ బ్యాంకుల్లో కెల్లా ఈ బ్యాంక్ మీకు ఉత్తమ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఐదేళ్లలో రూ .1.5 లక్షల మొత్తం రూ .2.05 లక్షలకు పెరుగుతుంది.
4. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలపై 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. రూ .1.5 లక్షల మొత్తం ఐదేళ్లలో రూ .2.05 లక్షలకు పెరుగుతుంది.
5. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలపై 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. రూ .1.5 లక్షల మొత్తం ఐదేళ్లలో రూ .2.05 లక్షలకు పెరుగుతుంది.
పైన పేర్కొన్న వడ్డీ రేట్లు సాధారణ పౌరులు ఐదేళ్ల పాటు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రమే. సీనియర్ సిటిజన్లకు 0.5 అదనపు వడ్డీ లభిస్తుంది. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) రూ .5 లక్షల వరకు ఎఫ్డీ డిపాజిట్లపై రాబడికి హామీ ఇస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.