FD Rates | ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లు చాలా పాపులర్. చాలా మంది వీటిల్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. పన్ను భారం తగ్గించుకోవాలని భావించే వారు వీటికి ప్రాధాన్యం ఇస్తారు. ట్యాక్స్ (Tax) సేవింగ్‌తో పాటు రాబడి కూడా పొందొచ్చు. అంటే రెండు రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలకు (FD) ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే డబ్బులు పెడితే ఐదేళ్ల వరకు వెనక్కి తీసుకోవడానికి కుదరదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లలో డబ్బులు పెడితే నెల లేదా త్రైమాసికం చొప్పున వడ్డీ పొందొచ్చు. బ్యాంక్ ప్రాతిపదికన వీటిపై వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం ఏ ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకుందాం.
డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులకు గుడ్ న్యూస్? వారిపై ఎఫెక్ట్!
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై 6.7 శాతం వడ్డీ పొందొచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.2 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే కెనరా బ్యాంక్‌లో చూస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై 6.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7 శాతం వడ్డీ వస్తుంది. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఇందులో ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.4 శాతం వడ్డీ పొందొచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.15 శాతం వడ్డీ లభిస్తుంది.
ఏటీఎం కార్డు ఉంటే ఉచితంగా రూ.10 లక్షల వరకు బెనిఫిట్.. వివరాలు ఇలా
ఇకపోతే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై లోన్స్ పొందటానికి వీలు ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలలో కేవలం రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి వీలు ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అర్జించిన వడ్డీ మొత్తంపై టీడీఎస్ కట్ అవుతుంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే ఆప్షన్ కింద చూపించాల్సి ఉంటుంది.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లి బ్యాంక్‌లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కాగా పన్ను మినహాయింపు పొందాలని భావించే వారికి ఇంకా ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్‌లో కూడా చేరొచ్చు. ఇన్వెస్ట్ చేసిన మొత్తం, వచ్చిన వడ్డీ, విత్‌డ్రా అమౌంట్ ఇలా దేనిపై కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Income tax, TAX SAVING