హోమ్ /వార్తలు /బిజినెస్ /

Car Sales: ఆ 3 కార్లను కొనే వారే లేరు.. అమ్మకాలు సున్నా, ఈ 3 కార్లకు మాత్రం ఫుల్ డిమాండ్!

Car Sales: ఆ 3 కార్లను కొనే వారే లేరు.. అమ్మకాలు సున్నా, ఈ 3 కార్లకు మాత్రం ఫుల్ డిమాండ్!

Car Sales: ఆ 3 కార్లను కొనే వారే లేరు.. అమ్మకాలు సున్నా, ఈ 3 కార్లకు మాత్రం ఫుల్ డిమాండ్!

Car Sales: ఆ 3 కార్లను కొనే వారే లేరు.. అమ్మకాలు సున్నా, ఈ 3 కార్లకు మాత్రం ఫుల్ డిమాండ్!

Best Cars | మీరు కొత్త కారు కొనే యోచనలో ఉంటే.. జనాలు ఎక్కువగా ఏ ఏ కార్లను కొంటున్నారో తెలుసుకోండి. దీంతో మీకు కూడా ఒక అవగాహన వస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Top Cars | కొత్త ఏడాదిలో కొత్తగా కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఏ ఏ కార్లును జనాలు ఎక్కువగా ఉంటున్నారో క ఐడియా ఉండాలి. అలాగే ఏ ఏ కార్లకు డిమాండ్ లేదో కూడా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడే ఏ కారు (Car) కొనాలి? ఏ కారు కొనకూడదు? అనే విషయాలు తెలుస్తాయి. మనం ఇప్పుడు డిసెంబర్ నెలలో ఎక్కువగా ప్రజలు కొనుగోలు చేసిన ఎస్‌యూవీలు (SUV) కార్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఏ ఏ కార్ల అమ్మకాలు సున్నగా నమోదు అయ్యాయో ఇప్పుడు చూద్దాం.

2022 డిసెంబర్ నెలలో క్రెటా అమ్మకాలు దుమ్మురేపాయి. ఈ కారు నెంబర్ 1 సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలిచింది. వార్షికంగా ఈ కారు అమ్మకాలు 34 శాతం పెరిగాయి. గత నెలలో ఈ కారు అమ్మకాలు 10,205 యూనిట్లుగా నమోదు అయ్యాయి. 2021 డిసెంబర్‌లో ఈ కారు అమ్మకాలు 7609 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే గ్రాండ్ విటారా బ్రెజా రెండో స్థానంలో ఉంది. ఈ కారు అమ్మకాలు 6171 యూనిట్లుగా ఉన్నాయి.

రూ.400తో కన్యాకుమారి నుంచి కశ్మీ‌ర్ వెళ్లొచ్చు.. ఎలక్ట్రిక్ బైక్ అదిరింది!

ఇక మూడో స్థానంలో సెల్టోస్ నిలిచింది. ఈ కారు అమ్మకాలు 5,995 యూనిట్లుగా ఉన్నాయి. 2021 డిసెంబర్ నెలలో ఈ కారు అమ్మకాలు 4012 యూనిట్లుగా ఉండటం గమనార్హం. అంటే వార్షికంగా 18 శాతం మేర పెరుగుదల నమోదు అయ్యింది. ఇలా ఈ మూడు ఎస్‌యూవీలు టాప్ 3లో నిలిచాయి. ఇకపోతే 2022 డిసెంబర్ నెలలో కొన్ని కార్ల అమ్మకాలు సున్నాగా నమోదు అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పండుగ పూట కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ .. కీలక నిర్ణయం!

ఎస్ క్రాస్ అమ్మకాలు జీరో. ఈ కారు అమ్మకాలు 2021 డిసెంబర్ నెలలో 1521 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే కిక్స్ కారు అమ్మకాలు కూడా సున్నాం. ఈ కారు అమ్మకాలు 2021 డిసెంబర్ నెలలో 130 యూనిట్లుగా ఉన్నాయి. ఇక డస్టర్ అమ్మకాలు కూడా జీరోనే. ఈ కారు అమ్మకాలు 2021 డిసెంబర్ నెలలో 56 యూనిట్లుగా నమోదు అయ్యాయి. ఇలా ఈ మూడు కార్ల అమ్మకాలు గత నెలలో సున్నాగా నమోదు అయ్యాయి.

ఇకపోతే నెలవారీ ప్రాతిపదికన చూస్తే.. క్రెటా అమ్మకాలు 23 శాతం తగ్గాయి. నవంబర్ నెలలో ఈ కార అమ్మకాలు 13,321 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే గ్రాండ్ విటారా అమ్మకాలు 39 శాతం పెరిగాయి. నవంబర్‌లో ఈ అమ్మకాలు 4433 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే సెల్టోస్ అమ్మకాలు కూడా 35 శాతం మేర పడిపోయాయి. నవంబర్‌లో ఈ కారు అమ్మకాలు 9284 యూనిట్లుగా ఉన్నాయి. అంటే విటారా దుమ్మురేపుతోందని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Best cars, Budget cars, Cars, Hyundai, Kia cars, Maruti cars, SUV

ఉత్తమ కథలు