TOP 10 THINGS TO KEEP IN MIND BEFORE BUYING A HOUSE UMG GH
Buying a House: కొత్త ఇల్లు కొంటున్నారా? ఇంటిని సెలక్ట్ చేసే ముందు ఈ పది విషయాలు తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఇల్లు కొనడం అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కష్టపడి పోగేసిన ప్రతి రూపాయిని వెచ్చించి కొనే ఆస్తి ఇది. అందువల్ల మీరు కొనే ఇంటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. దీనికి సంబంధించి కొనుగోలుదారులు తెలుసుకోవాల్సిన పది ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం.
చాలా మంది భారతీయులు తమ పేరుతో ఒక సొంత ఇల్లు (Own House) ఉండాలని కోరుకుంటారు. జీవితంలో ఒక ఇల్లు కొనడం(Buying House), లేదా కట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ కోరికను తీర్చుకోవడానికి పొదుపు (Savings) చేస్తుంటారు. ఇతర ఆర్థిక అవసరాలను తగ్గించుకుని కూడా ఇంటి కోసం ఆదా చేస్తుంటారు. ఇల్లు కొనడం అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కష్టపడి పోగేసిన ప్రతి రూపాయిని వెచ్చించి కొనే ఆస్తి ఇది. అందువల్ల మీరు కొనే ఇంటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. దీనికి సంబంధించి కొనుగోలుదారులు తెలుసుకోవాల్సిన పది ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం.
రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో వ్యవహరించేటప్పుడు, కార్పెట్ ఏరియా(Carpet Area), బిల్ట్-అప్ ఏరియా(Built-Up Area), సూపర్-బిల్ట్ అప్ ఏరియా(Super-Built Up Area) వంటి విభిన్న పదాలను వినవచ్చు. ఇక్కడ ప్రాపర్టీలో కార్పెట్ ఏరియా అనేది ఎక్స్టర్నల్ వాల్స్‌తో సంబంధం లేకుండా ఉపయోగించుకోగల స్థలం. కాబట్టి, ఆస్తిని కొనుగోలు చేసే ముందు మీరు ఎంత ప్రాంతాన్ని ఉపయోగించాలనుకుంటున్నారో నిర్ధారించుకోవాలి. బిల్ట్- అప్ ఊరియాలో ఎక్స్టర్నల్ వాల్స్ ఆక్రమించిన స్థలం కూడా కలుస్తుంది. సూపర్-బిల్ట్ అప్ ఏరియాలో పార్కింగ్, లిఫ్ట్, లాబీ మొదలైన ప్రాంతాలు ఉంటాయి.
ఆస్తిని లోపలి నుంచి స్కాన్ చేయడంతో పాటు, ఆస్తి ఉన్న ప్రాంతం, దాని సమీపంలోని సౌకర్యాల కనెక్టివిటీని కూడా తనిఖీ చేయాలి. మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్, ఆసుపత్రులు, పాఠశాలలు, వంటి సౌకర్యాలను పరిశీలించాలి.
మీరు కొత్త ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేసే ముందు, అక్కడ నివసిస్తున్న నివాసితులతో మాట్లాడటానికి ప్రయత్నించాలి. కామన్‌గా షేర్ చేసుకోవాల్సిన ఫెసిలిటీస్ ఏవైనా ఉంటే ముందుగానే తెలుసుకోవాలి. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా భావసారూప్యత కలిగిన వారితో కలిసి జీవించడం మేలు.
భూమి/ఆస్తి కోసం డబ్బును ఖర్చు చేయడానికి ముందు, ఒక న్యాయ నిపుణుడితో పత్రాలను తనిఖీ చేయించాలి. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని నిర్ధారించుకోవాలి. ల్యాండ్ డీడ్, ల్యాండ్ యూజ్ వంటి రియల్ ఎస్టేట్ నిబంధనలతో పరిచయం లేని వ్యక్తులకు ఆస్తి పత్రాలు సక్రమంగా అర్థం కావు. కాబట్టి నిపుణుల సహాయంతో పత్రాలను పరిశీలించి, ఆపై నిర్ణయం తీసుకోవడం మేలు.
ఇదీ చదవండి: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు.. వ్యాపారులకు గుడ్ న్యూస్.. మార్పులివే..!
డీలర్ ఎల్లప్పుడూ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా ఆస్తిని కొనుగోలు చేసేందుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. అక్కడి నివాసితులతో మాట్లాడటం ద్వారా స్పష్టమైన పిక్చర్ పొందాలి. అక్కడ నివసించే కొందరిని సంప్రదించి, నీటి సరఫరా సక్రమంగా ఉందా? వ్యాయామశాల పని చేస్తుందా? స్విమ్మింగ్ పూల్ సమయానికి శుభ్రం చేస్తున్నారా? విద్యుత్ సరఫరా ఎలా ఉంది? వంటి వివరాలను తెలుసుకోవాలి.
పొరుగున ఏదైనా చిన్న భవనం లేదా బంగళా ఉన్నాయేమో చూడాలి. అలాంటివి భవిష్యత్తులో పెద్ద భవనాలుగా మారితే.. కొన్న ఇల్లుకు అడ్డుగా ఉంటుంది. దీని కారణంగా ఇంటి విలువ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఆస్తి నిర్వహణ ఖర్చు బడ్జెట్లో సరిపోతుందో లేదో చూసుకోవాలి. మెయింటెనెన్స్ ఛార్జీలు, కమ్యూటింగ్ ఛార్జీలు, ఆస్తి పన్ను తదితరాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటికి ఎంత చెల్లించాల్సి వస్తుందో ముందే అంచనాకు రావాలి.
ఇంటిని ఖరారు చేసే ముందు హోమ్‌లోన్ ఆప్షన్లను క్షుణ్ణంగా అన్వేషించాలి. వివిధ లోన్ ప్రొవైడర్ల పథకాలను స్కాన్ చేయడం ద్వారా అందుబాటులో ఉన్న చౌకైన హోమ్‌లోన్ ఆప్షన్‌ను ఎంచుకోగలరు. వుమెన్ కో ఓనర్షిప్, సీనియర్ సిటిషన్ వంటి వాటిల్లో దేని కింద లోన్ తీసుకుంటే ప్రయోజనమో తెలుసుకుంటే మంచిది.
ఇంటిని కొనాలని నిర్ణయించుకునే ముందు పేమెంట్ ఎలా చేయాలనే దానిపై డీలర్‌తో చర్చించాలి. చాలా మంది డీలర్లు భారీ నగదు మొత్తాన్ని డిమాండ్ చేస్తారు. ఫిజికల్‌గా పెద్ద మొత్తంలో నగదు అరేంజ్ చేయడం అందరికీ సాధ్యం కాదు.
డీలర్ నుంచి ఇంటికి సంబంధించి కోట్ పొందిన తర్వాత, పొరుగు భవనాల ధరలు యావరేజ్‌గా ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. సమీపంలోని ఆస్తుల నిర్మాణ నాణ్యత, ప్రాంతం, సౌకర్యాలను తెలుసుకోండి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.