హోమ్ /వార్తలు /బిజినెస్ /

Car Manufacturers: ఫెస్టివల్ సీజన్‌లో పెరిగిన కార్ల అమ్మకాలు.. అక్టోబర్‌ సేల్స్‌లో టాప్‌-10 కంపెనీలు ఇవే..

Car Manufacturers: ఫెస్టివల్ సీజన్‌లో పెరిగిన కార్ల అమ్మకాలు.. అక్టోబర్‌ సేల్స్‌లో టాప్‌-10 కంపెనీలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత నెలలో ఆటోమొబైల్ కంపెనీల సేల్స్‌ 48 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022 అక్టోబర్‌లో అత్యధికంగా కార్లను విక్రయించిన టాప్‌ 10 కంపెనీలను పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Car Manufacturers: పండుగ సీజన్‌ వస్తుంటే అన్ని రకాల వ్యాపార సంస్థలు ఆఫర్లతో సిద్ధమవుతాయి. వినియోగదారుల నమ్మకాలను, అవసరాలను ఆసరగా చేసుకుని బిజినెస్‌ పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్‌లో కూడా సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. దీంతో అక్టోబర్‌లో అన్ని రకాల వ్యాపారాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ కంపెనీల సేల్స్‌ 48 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022 అక్టోబర్‌లో అత్యధికంగా కార్లను విక్రయించిన టాప్‌ 10 కంపెనీలను పరిశీలిద్దాం.

MG మోటార్

MG మోటార్ ఈ ఏడాది అక్టోబర్‌లో 4,367 యూనిట్లను విక్రయించి, 52.5 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ 2022 సెప్టెంబర్‌లో 3,808 యూనిట్లను సేల్‌ చేసింది. మంత్‌ ఆన్‌ మంత్‌ సేల్స్‌లో 14.7 శాతం గ్రోత్ కనిపించింది.

స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్

అత్యధికంగా కార్లను విక్రయించిన జాబితాలో ఈ కంపెనీ పదో స్థానంలో నిలిచింది. వోక్స్‌వ్యాగన్ 2022 అక్టోబర్‌లో 3,510 యూనిట్లను సేల్‌ చేసింది. మొత్తం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ అమ్మకాల్లో 14.10 శాతం అభివృద్ధిని సాధించింది. అయితే 2022 సెప్టెంబర్‌లో 4,103 యూనిట్లను సేల్‌ చేసింది. దీంతో మంత్‌ ఆన్‌ మంత్‌ సేల్స్‌ 14.55 శాతం క్షీణించాయి.

 రెనాల్ట్

ఇయర్‌ ఆన్‌ ఇయర్‌లో సేల్స్‌లో తగ్గుదలను నమోదు చేసిన కంపెనీ రెనాల్ట్ మాత్రమే. ఈ కంపెనీ సేల్స్‌ గత ఏడాదితో పోలిస్తే 12.70 శాతం క్షీణించాయి. కంపెనీ 2022 సెప్టెంబర్లో విక్రయించిన 7,623 యూనిట్లతో పోలిస్తే 2022 అక్టోబర్లో 7,778 యూనిట్లను మాత్రమే విక్రయించింది. మంత్‌ ఆన్‌ మంత్‌ సేల్స్‌లో 2 శాతం పెరుగుదల కనిపించింది.

హోండా

హోండా కార్స్ ఇండియా 2022 అక్టోబర్‌లో 17.7 శాతం యాన్యువల్ గ్రోత్‌ నమోదు చేసింది. 9,543 యూనిట్ల సేల్స్‌తో ఏడో స్థానంలో నిలిచింది. 2022 సెప్టెంబర్‌లో 8,714 యూనిట్లను సేల్‌ చేసింది. మంత్‌ ఆన్ మంత్‌ సేల్స్‌ 9.5 శాతం పెరిగాయి.

టయోటా

2022 అక్టోబర్‌లో టయోటా కిర్లోస్కర్ మోటార్ 5.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. 13,143 యూనిట్లను సేల్‌ చేసింది. అయితే కంపెనీ 2022 సెప్టెంబర్‌లో 15,378 యూనిట్లను విక్రయించింది. టయోటా మంత్‌ ఆన్‌ మంత్‌ సేల్స్‌ 14.5 శాతం పడిపోయాయి.

 కియా

కియా 42.8 శాతం వార్షిక అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. అధికంగా అమ్ముడుపోయిన మోడల్స్‌లో Seltos, Sonet SUVs, Carens MPV ఉన్నాయి. కార్‌మేకర్ 2022 అక్టోబర్‌లో 23,323 యూనిట్లను విక్రయించింది. 2022 సెప్టెంబర్‌లో 25,857 యూనిట్లను విక్రయించింది. దీంతో మంత్‌ ఆన్‌ మంత్‌ సేల్స్‌ దాదాపు 10 శాతం క్షీణించాయి.

మహీంద్రా & మహీంద్రా

మహీంద్రా & మహీంద్రా అత్యధికంగా 60 శాతం వృద్ధిని సాధించింది. 2022 సెప్టెంబర్‌లో సేల్‌ చేసిన 34,262 యూనిట్లతో పోలిస్తే 2022 అక్టోబర్‌లో కంపెనీ 32,226 యూనిట్ల సేల్స్‌ నమోదు చేసింది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ అత్యధికంగా వృద్ధిని నమోదు చేసినప్పటికీ.. మంత్‌ ఆన్‌ మంత్‌ సేల్స్‌లో 6 శాతం క్షీణతను చూసింది.

టాటా మోటార్స్

టాటా మోటార్స్ గత నెలలో 45,220 యూనిట్లను విక్రయించి భారత మార్కెట్లో మూడో స్థానానికి చేరుకుంది. టాటా మోటార్స్ ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 33.3 శాతం సేల్స్‌ను నమోదు చేయగా, మంత్‌ ఆన్‌ మంత్‌ 5 శాతానికిపైగా పడిపోయాయి.

Vegan Skincare: వేగన్ స్కిన్‌ కేర్‌ రొటీన్‌తో బెస్ట్‌ రిజల్ట్స్‌..ఈ టిప్స్‌పై ఓ లుక్కేయండి..

హ్యుందాయ్

2022 అక్టోబర్‌లో హ్యుందాయ్‌ 48,001 యూనిట్ల సేల్స్‌తో టాప్ 10 కంపెనీల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ 2022 సెప్టెంబర్‌తో పోలిస్తే సేల్స్‌లో ఇయర్‌ ఇన్‌ ఇయర్‌ 29.7 శాతం వృద్ధిని సాధించగా, మంత్‌ ఆన్‌ మంత్‌ 3.4 శాతం తగ్గింది.

మారుతీ సుజుకి

2022 అక్టోబర్‌లోమారుతి సుజుకి 1,40,337 యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ సేల్స్‌ దాదాపు 29 శాతం పెరిగాయి. మంత్‌ ఆన్‌ మంత్‌ సేల్స్‌ 5 శాతానికి పైగా క్షీణించాయి.

First published:

Tags: Car sales, MARUTI SUZUKI, Volkswagen

ఉత్తమ కథలు