హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందించే టాప్-10 బ్యాంకులివే

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందించే టాప్-10 బ్యాంకులివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మీరు 3 నుంచి 5 ఏళ్ల మధ్య కాలంలో ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఎక్కువ వడ్డీని అందించే బ్యాంకుల గురించి ఆరా తీయాలి. ప్రస్తుతం అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న టాప్-10 బ్యాంకుల జాబితాను పరిశీలించాలి.


మెరుగైన రాబడులు.. కాలపరిమితిలో స్థిరత్వం.. సులభమైన, స్పష్టమైన పెట్టుబడితో పాటు అత్యధిక లిక్విడిటీని కలిగి ఉండే వాటిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు(FD) ముందు వరుసలో ఉంటాయి. అందుకే దేశంలోనే అత్యంత పాపులరైన పెట్టుబడి మార్గంగా ఎఫ్‌డీలను పరిగణిస్తారు. అయితే కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని ఎదుర్కోవడానికి రెపోరేటును మార్చకూడదని భారత రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి.


పెట్టుబడిదారుడి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం FD రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే వాస్తవిక నికర రాబడిని తగ్గిస్తుంది. సీనియర్ సిటిజన్లు లాంటి రిస్క్ విముఖత లేని పెట్టుబడిదారులకు ఇది ఆందోళన కలిగించే ధోరణి. వారి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మాత్రమే కాకుండా రోజువారీ ఖర్చుల కోసం FD రిటర్నులపై ఆధారపడతారు. ప్రస్తుతం బ్యాంకులు రూ.1 కోటి లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఏడాదికి 4.25 శాతం నుంచి 5.50 శాతం మధ్య ఉంచుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రైవేటు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 7.25 శాతం కంటే ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి.


పెట్టుబడుదారులు తమ నిధుల్లో కొంత భాగాన్ని సమగ్ర రిస్క్ అసెస్మెంట్ తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మదుపు చేయవచ్చు. ఇవి రాబడి అంచనాలు, రిస్క్ టాలరెన్స్‌కు అనుగుణంగా ఉంటాయి. కాబట్టి మీరు 3 నుంచి 5 ఏళ్ల మధ్య కాలంలో ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఎక్కువ వడ్డీని అందించే బ్యాంకుల గురించి ఆరా తీయాలి. ప్రస్తుతం అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న టాప్-10 బ్యాంకుల జాబితాను పరిశీలించాలి.


మూడు నుంచి ఐదేళ్ల FDలపై అత్యధిక వడ్డీరేట్లను అందిస్తున్న టాప్-10 బ్యాంకులు..


సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ చిన్న ఫైనాన్స్ బ్యాంక్.. 7.25 శాతం అత్యధిక వడ్డీతో జాబితాలో మొదటి స్థానంలో ఉంది. తాజా వడ్డీ రేట్లు 2021 ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి.


ఉజ్వాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఉజ్వాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు 2021 మార్చి 5 నుంచి అమల్లో ఉంటున్నాయి.


జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 6.75 శాతం వడ్డీతో ఎఫ్‌డీలను ప్రకటించింది. 2021 మే 7 నుంచి సవరించిన వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి.


డీసీబీ బ్యాంక్

ఈ ప్రైవేటు బ్యాంక్ ఎఫ్‌డీలపై 6.50 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు 2021 మే 15 నుంచి అమల్లో ఉంటున్నాయి.


ఆర్బీఎల్ బ్యాంక్

ఆర్బీఎల్ ప్రైవేటు బ్యాంక్ సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీని అందిస్తోంది. 2021 జూన్ 1 నుంచి ఈ రేట్లు వర్తిస్తున్నాయి.


యస్ బ్యాంక్

ఈ ప్రైవేటు బ్యాంక్ కూడా అత్యధికంగా 6.50 శాతం రేటును ఎఫ్‌డీలపై ప్రకటించాయి. 2021 జూన్ 3 నుంచి సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.


ఫిన్ కోర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 2021 మే 17 నుంచి ఎఫ్‌డీలపై 6.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి.


ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2021 జూన్ 1 నుంచి 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.


ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.25 శాతం (2021 ఏప్రిల్ 1 నుంచి), డూష్ బ్యాంక్ 6.25 శాతం (2021 మే 18 నుంచి) వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.




 పైన పేర్కొన్న అన్ని వడ్డీరేట్లు కోటి రూపాయల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లు సాధారణ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్ల వరకు ప్రిపరెన్షియల్ రేట్లను పొందుతారు.

First published:

Tags: Bank, Business, Fixed deposits