ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటో కంపెనీలు ఇంటర్నేషనల్(International) వేదికలపై తమ ప్రొడక్టులను ఇంట్రడ్యూస్(Introduce) చేస్తుంటాయి. ఇతర దేశాల్లోనూ మార్కెట్ పెంచుకునేందుకు ఈ అవకాశాలను వినియోగించుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ‘మిలాన్ మోటార్‌సైకిల్స్ షో’- EICMAకు ఇటలీ(Italy) వేదికకానుంది. ఈవెంట్ రేపు, అంటే నవంబర్ 8న మిలన్లో ప్రారంభం కానుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ ఈవెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్(Royal Enfield) పాల్గొంటోంది. ఈ ఏడాది ఇండియా(India) నుంచి కొత్తబ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ (Electric) కూడా హాజరవుతోంది. EICMA అంతర్జాతీయ తయారీదారులు తమ ప్రొడక్ట్స్‌ను ఆవిష్కరించడానికి, ప్రదర్శించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మోటర్ షోలో దాని SG650 కాన్సెప్ట్‌ను మొదటిగా ఇంట్రడ్యూస్ చేయనుంది. ఈ సంవత్సరం ఈవెంట్లో భారతదేశానికి చెందిన కంపెనీలు ఏ మోడల్స్‌ను ప్రదర్శించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓలా ఎలక్ట్రిక్
ఓలా ఎలక్ట్రిక్ అంతర్జాతీయ మోటార్ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి. భారతదేశంలో అతి తక్కువ ధరకు S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. అయితే ఇటలీ, మిలన్లో జరుగుతున్న షోలో ఎలక్ట్రిక్ బైక్ మొత్తం లైనప్‌ను ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. తమిళనాడులోని క్రిష్ణగిరిలోని ఫ్యూచర్ ఫ్యాక్టరీని ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఉంటుందని ఓలా చెబుతోంది. లాటిన్ అమెరికా, ఆసియాన్, యూరప్ సహా అమ్మకాలను విస్తరించడానికి కంపెనీ చర్యలు తీసుకుంటోంది. EICMAలో ఓలా ఎలక్ట్రిక్ ఏదైనా కొత్త ప్రకటనలు చేస్తుందేమో అని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్
ఈవెంట్లో జరిగే ఆవిష్కరణల్లో రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 అతిపెద్ద హైలైట్ కానుంది. చెన్నైకి చెందిన మ్యానుఫ్యాక్చరర్ దీని కోసం టీజర్ ఇమేజెస్‌ను రిలీజ్ చేస్తోంది. సూపర్ మెటోర్ 650 అనేది రాయల్ ఎన్ఫీల్డ్ 648cc పార్లల్ ట్విన్ ఇంజన్, 47 hp, 52 Nm టార్క్‌తో వస్తోంది. ఇది సిక్స్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న మూడవ మోటార్‌సైకిల్. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650లలో కూడా పార్లల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. సూపర్ మెటోర్ 650, మెటోర్ 350 తరహాలో ఫార్వర్డ్ సెట్ ఫుట్రెస్ట్లతో కూడిన క్రూయిజర్‌గా ఉంటుంది. ఈ బైక్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ వంటి అప్‌గ్రేడ్ చేసిన ఎక్విప్మెంట్స్తో వస్తుందని భావిస్తున్నారు.
ఎన్ఫీల్డ్ 650 ట్విన్ ధర రూ.2.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. కొత్త, రాబోయే సూపర్ మెటోర్ 650 రూ.3లక్షల నుంచి రూ.3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబర్ 18న గోవాలో జరిగే 2022 రైడర్ మానియా మోటార్‌సైకిల్ ఫెస్టివల్లో ఈ బైక్‌ను ప్రదర్శించనున్నారు.
గత సంవత్సరం EICMAలో TVS యూరోగ్రిప్ పాల్గొంది. తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను ప్రదర్శించింది. భారతదేశంలోని మదురై,ఇటలీలోని మిలన్లో ఉన్న R&D కేంద్రాల మధ్య సహకారంతో యూరోపియన్, ఆసియా, భారతీయ మార్కెట్ల కోసం తయారుచేస్తున్న తాజా లైనప్ ప్రొడక్ట్స్‌ను కంపెనీ ప్రదర్శించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Automobiles