హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jr NTR-TSRTC: ఆర్టీసీ ఆర్డినరి బస్సులో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణం.. అభిమానులకు సర్ ప్రైజ్.. ఇదిగో వీడియో..

Jr NTR-TSRTC: ఆర్టీసీ ఆర్డినరి బస్సులో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణం.. అభిమానులకు సర్ ప్రైజ్.. ఇదిగో వీడియో..

జూనియర్ ఎన్టీఆర్  (Twitter/Photo)

జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)

టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ (Viral Video) గా మారింది.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయ పోస్టులన్నీ ఎక్కువగా ఆర్టీసీని (TSRTC) ప్రమోట్ చేసేవి, ప్రజలను వివిధ నేరాలపై అవగాహన కల్పించేవే ఉంటాయి. ఆర్టీసీని ప్రమోట్ చేయడానికి ఆయన ట్విట్టర్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. సంస్థ తీసుకువచ్చే వివిధ ఆఫర్లకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఉంటారు. తాజాగా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR) బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు సజ్జనార్. అరవింద సమేత సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారు. ఆ వీడియోను షేర్ చేశారు సజ్జనార్. ఆ వీడియో ద్వారా హ్యాపీ బర్త్ డే జూనియర్ ఎన్టీఆర్ అంటూ శుభాకాంక్షలు చెప్పారు సజ్జనార్.

ఆ వీడియోకు గతంలో ఎన్టీఆర్ కు సజ్జనార్ పుష్పగుచ్ఛం అందించిన ఫొటోను కూడా జత చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. థాంక్యూ సజ్జనార్ సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

NTR: ఎన్టీఆర్ వీడియో పోస్టు చేసిన సజ్జానార్... జై ఎన్టీఆర్ అంటోన్న ఫ్యాన్స్

గతంతో సైతం దృశ్యం సినిమాలో వెంకటేష్ తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సన్నివేశానికి సంబంధించిన వీడియో ను సైతం షేర్ చేశారు సజ్జనార్. ఇంకా శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సన్నివేశానికి సంబంధించిన వీడియోను సైతం సజ్జనార్ షేర్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

First published:

Tags: Jr ntr, Sajjanar, Tollywood, Tsrtc

ఉత్తమ కథలు