Gas Cylinder Price | పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్.. ఇవి ప్రతి రోజూ కావాల్సిందే. వీటితో నిత్యం మనకు అవసరం పడుతూనే ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే కారు లేదా టూవీలర్ కావాల్సిందే. వీటికి పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) కొట్టించాల్సిందే. అలాగే ఇంట్లో వండుకొని తినాలంటే కచ్చితంగా ఎల్‌పీజీ సిలిండర్ కావాల్సిందే. ఇలా వీటితో మనకు నిత్యం అవసరం పడుతూనే ఉంటుంది. అందుకే వీటి రేట్లలో ఏమాత్రం పెంపు ఉన్నా కూడా ఆ ప్రభావం చాలా మందిపై పడుతుంది. అలాగే తగ్గింపు ఉన్నా కూడా ఆ బెనిఫిట్ ఎక్కువ మందికి చేరుతుంది.
ఈ క్రమంలో మనం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ , ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. ఈ రోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 109.64 వద్ద కొనసాగుతోంది. అలాగే డీజిల్ ధర విషయానికి వస్తే.. లీటరుకు రూ. 97.8 వద్ద ఉంది.
ఉచితంగా ఎల్ఐసీ క్రెడిట్ కార్డులు.. ఫ్రీగా రూ.5 లక్షల బెనిఫిట్, ఇలా అప్లై చేసుకోండి!
అలాగే వరంగల్‌లో చూస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 109.14గా, రూ. 97.33 వద్ద ఉన్నాయి. విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ కొనాలంటే రూ. 110.46 చెల్లించుకోవాలి. అలాగే డీజిల్ ధర రూ. 98.25 వద్ద కొనసాగుతోంది. గుంటూరులో అయితే పెట్రోల్ రేటు రూ. 111.74 వద్ద ఉంది. డీజిల్ రేటు రూ. 99.49 వద్ద కొనసాగుతోంది. కడపలో పెట్రోల్, డీజిల్ రేట్లు వరుసగా రూ. 110.68 వద్ద, రూ. 98.48 వద్ద ఉన్నాయి.
కేంద్రం కీలక నిర్ణయం.. 8 లక్షల కుటుంబాలకు ఉచితంగా డిష్ టీవీ!
ఇకపోతే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే.. వంట గ్యాస్ ధర కొంత కాలంగా స్థిరంగా ఉంటూ వస్తోందని చెప్పుకోవచ్చు. జనవరి 1న కూడా ఎల్‌పీజీ గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే వాణిజ్య సిలిండర్ రేటు మాత్రం రూ. 25 మేర పైకి కదిలింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధరను గమనిస్తే.. ఇది రూ. 1110 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేటు కాస్త అటు ఇటుగా దాదాపు ఇదే స్థాయిలో ఉంది. కొత్త ఏడాదిలో గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుందని చాలా మంది భావించారు. అయితే సిలిండర్ రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది. కాగా సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన సమీక్షిస్తూ వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diesel price, Diesel rate, LPG, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price, Petrol Price, Petrol rate