Today Gold Rates| తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు...డిమాండ్ లేకపోవడమే కారణం....

సోమవారం 24 కేరట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.33,600గా నమోదయ్యింది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గత శుక్రవారం 24 కేరట్ల 10 గ్రాముల బంగారం రూ.33,840గా నమోదవ్వగా, సోమవారం బులియన్ మార్కెట్లో బంగారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

news18-telugu
Updated: June 10, 2019, 5:17 PM IST
Today Gold Rates| తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు...డిమాండ్ లేకపోవడమే కారణం....
తగ్గిన బంగారం ధరలు
  • Share this:
Today Gold Rates| బంగారం ధరలు హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం 24 కేరట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.33,600గా నమోదయ్యింది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గత శుక్రవారం 24 కేరట్ల 10 గ్రాముల బంగారం రూ.33,840గా నమోదవ్వగా, సోమవారం బులియన్ మార్కెట్లో బంగారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అలాగే ముంబైలో 24 కేరట్ల 10 గ్రాములు బంగారం ధర 33,620 గా నమోదుకాగా, చెన్నైలో రూ.33,710 గా ట్రేడ్ అవుతోంది. అలాగే హైదరాబాద్ లో 22 కేరట్ల 10 గ్రాములు రూ.31,110గా ట్రేడవుతోంది. ముంబైలో 22 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,740గా ట్రేడవుతోంది.

ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లలో సైతం బంగారంపై మదుపుదారులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో పాటు, గ్లోబల్ గా యూఎస్ జాబ్స్ డేటా సానుకూలంగా రావడం, అలాగే మెక్సికోపై టారిఫ్ ల విధింపుపై అమెరికా వెనక్కు తగ్గడం వల్ల బంగారం డిమాండ్ స్వల్పంగా తగ్గింది. దీంతో స్థానిక మార్కెట్లలో ఈ ప్రభావం కనిపిస్తోంది. లోకల్ మార్కెట్లలో ఆభరణాల కోసం కొనుగోలు చేసే బంగారం సోమవారం ప్రతీ 10 గ్రాములకు గానూ రూ.400 నుంచి 800 వరకూ తగ్గుముఖం పట్టింది.

First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు