Today Gold Rate | రికార్డులు బద్దలు కొట్టిన బంగారం...పసిడి ధర రూ.36 వేల పై మాటే...

సోమవారం హైదరాబాద్ లో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.35720 స్థాయిని తాకింది. కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ సుంకం 10 నుండి 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బంగారం ధర చుక్కలను దాటింది. శుక్రవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం బులియన్ మార్కెట్లో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్క సారిగా రూ36 వేలను తాకింది.

news18-telugu
Updated: July 8, 2019, 5:29 PM IST
Today Gold Rate | రికార్డులు బద్దలు కొట్టిన బంగారం...పసిడి ధర రూ.36 వేల పై మాటే...
(ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 8, 2019, 5:29 PM IST
Today Gold Rate | బంగారం సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ గరిష్ట స్థాయిలో దూసుకెళుతోంది. సోమవారం హైదరాబాద్ లో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.35720 స్థాయిని తాకింది. కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ సుంకం 10 నుండి 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బంగారం ధర చుక్కలను దాటింది. శుక్రవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం బులియన్ మార్కెట్లో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్క సారిగా రూ36 వేలను తాకింది. సోమవారం బంగారం ధరలు కొద్దిగా శాంతించినప్పటికీ రూ.35 వేలకు పైనే కొనసాగుతోంది. అదే సమయంలో హైదరాబాద్ లో 22 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.33030 గా నమోదైంది.

ఇదిలా ఉంటే కేంద్రం బడ్జెట్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం పెంచడం పట్ల వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధరలతో బంగారం కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని వాపోతున్నారు. అంతేకాదు బంగారం దిగుమతులు తగ్గడంతో పాటు భవిష్యత్తులో బంగారం మరింత ఖరీదు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే ఫెస్టివల్ సీజన్ లో మధ్యతరగతి వర్గాలు ఆసక్తి చూపకపోవచ్చని, బంగారం ధరలు మరింత ప్రియం అయ్యే అవకాశాలున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...