బిగ్ షాక్.. ఆల్ టైం రికార్డు స్థాయికి బంగారం ధర..

ప్రతీకాత్మక చిత్రం

Gold Rates in Hyderabad : కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొనసాగుతున్న బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ఏకంగా రూ.45 వేలకు చేరుకొని పసిడి ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది.

 • Share this:
  కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొనసాగుతున్న బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ఏకంగా రూ.45 వేలకు చేరుకొని పసిడి ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది. కేవలం రెండు నెలల్లోనే రూ.5 వేలు పెరిగి రికార్డు నెలకొల్పింది. జనవరిలో రూ.40 వేల ప్రారంభమై రెండు నెలలు ముగిసే సరికి రూ.5 వేలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,920, 22 క్యారెట్ల బంగారం ధర రూ.41వేలుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.43,050, 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,850గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.43,510 కాగా 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.42వేలుగా ఉంది.

  పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో బంగారం ధర ఆకాశాన్ని అంటడంతో కొనుగోలుదార్లు షాక్‌కు గురవుతున్నారు. త్వరలోనే బంగారం ధర రూ.50వేలకు చేరే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. 2019 మార్చిలో 24 క్యారెట్ గోల్డ్ గ్రాము రూ.3280 ఉండగా ఇప్పుడు రూ.4500కు చేరింది. అంటే గ్రాము ధర రూ.1220 పెరిగింది. గోల్డ్ మైన్స్ ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో కార్మికుల వేతనాలు 200 శాతం పెరిగాయని, అదే సమయంలో గనుల్లో బంగారం లభ్యత తగ్గడంతో పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

  ఇదంతా కరోనా ప్రభావమేనని.. చైనాలో 2500 మందికి పైగా మరణించడం, కొత్తగా దక్షిణ కొరియా, ఇటలీలో కొత్త కేసులు నమోదు కావడంతో భారత్‌ సహా ప్రపంచ స్టాక్‌మార్కెట్లు క్షీణించాయి. అదే సమయంలో పెట్టుబడులు తరలిరావడంతో బంగారం ధర 36 డాలర్లు పెరిగి.. ఔన్సు (31.10 గ్రాములు) 1680 డాలర్లకు చేరింది. అటు.. రూపాయి మరింత క్షీణించి, డాలర్‌ మారకపు విలువ రూ.71.98కి చేరడంతో ధరలు మరింత భగ్గుమన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం.. బంగారం ధర 1.34 శాతం తగ్గి రూ.42,996(ముంబై)కి చేరుకుంది. అయితే, మార్కెట్ ముగిసే సరికి పెరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: