Home /News /business /

TODAY GOLD PRICES ARE STABLE AND SILVER PRICES ARE REDUCED CHECK THE GOLD AND SILVER PRICES HERE PRV

Gold and silver Price Today: గుడ్​న్యూస్​.. స్థిరంగానే బంగారం ధర, భారీగా తగ్గిన వెండి ధరలు.. తులం బంగారం ఎంతుందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పండుగ సీజన్​ కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు

    పండుగ సీజన్​ కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అయితే వెండి ధరలో మార్పు వచ్చింది. హైదరాబాద్​లో కిలో వెండి (silver) priceపై రూ. 100 వరకు తగ్గింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం భారీగానే తగ్గింది. ముంబైలో ఏకంగా రూ. 4, 200 వరకు తగ్గింది. ఢిల్లీ, కోలకతాలలో రూ. 300 వరకు తగ్గింది. ఇక తాజాగా మంగళవారం (అక్టోబర్‌ 12)న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

    హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. విజయవాడ (Vijayawada)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. విశాఖ (vizag)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,890 ఉంది.

    ఇతర ప్రాంతాల్లో..

    ఢిల్లీ (Delhi)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,260 ఉంది. చెన్నై (Chennai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,060 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940 ఉంది.

    కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (gold price) రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది.

    దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి (silver price) రూ.61,700 ఉండగా, చెన్నైలో రూ.65,800 ఉంది. ముంబై (Mumbai)లో కిలో వెండి రూ.61,700 ఉండగా, కోల్‌కతాలో రూ.61,700 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61, 700 ఉండగా, కేరళలో రూ.65,800 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,800 ఉండగా, విజయవాడలో రూ. 65,800 వద్ద కొనసాగుతోంది.

    బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Gold price, Silver price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు