Home /News /business /

TODAY GOLD PRICES ARE STABLE AND SILVER PRICES ARE DOWN CLICK HERE TO KNOW FULL DETAILS OF GOLD AND SILVER PRICES IN ALL REGIONS PRV PRV

Gold price Today: మహిళలకు గుడ్​న్యూస్​.. స్థిరంగానే బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు.. తులం బంగారం ఎంతంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.

ఇంకా చదవండి ...
గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది. అయితే హైదరాబాద్ (Hyderabad)​లో బంగారం ధర స్థిరంగానే (Stable) ఉండటం శుభవార్తే.  ఒక వైపు బంగారం స్థిరంగా కొనసాగుతుంటే.. వెండి ధర (silver price) మాత్రం తగ్గుముఖం (down) పట్టింది. ఇక ముంబైలో మాత్రం 10 గ్రాముల బంగారంపై రూ.310 నుంచి రూ.350 వరకు ఎగబాకింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీగానే తగ్గింది. ఇక కరోనా కొత్త వేరియంట్‌ (new variant) ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారం (డిసెంబర్‌ 8)న దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ (Delhi)లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (Gold price) రూ.46,910 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర (Gold rate) రూ.51,170 వద్ద ఉంది.  ముంబైలో (Mumbai) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,820 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,820 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.

వెండి ధరలు చూస్తే..

ఢిల్లీలో కిలో వెండి ధర Silver price).61,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, కోల్‌కతాలో రూ.61,200 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,200 ఉండగా, కేరళలో రూ.65,500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, విజయవాడలో రూ.65,000 వద్ద కొనసాగుతోంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Gold price, Silver price

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు