Gold Rate: బంగారం తులం ధర రూ.40 వేలు దాటేసింది...అరలక్ష వైపు పసిడి పరుగులు...

దేశీయ మార్కెట్లో రిటైల్ బంగారం 10 గ్రాముల (24 కేరట్లు) ధర రూ.40 వేలు దాటేసింది. హైదరాబాద్‌లో బంగారం 10 గ్రాములు (24 కేరట్లు) ధర రూ.40240 వద్ద ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది.

news18-telugu
Updated: August 26, 2019, 4:00 PM IST
Gold Rate: బంగారం తులం ధర రూ.40 వేలు దాటేసింది...అరలక్ష వైపు పసిడి పరుగులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంగారం ధరలు అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అంతకంతకూ పెరుతున్నాయి. తాజాగా దేశీయ మార్కెట్లో రిటైల్ బంగారం 10 గ్రాముల (24 కేరట్లు) ధర రూ.40 వేలు దాటేసింది. హైదరాబాద్‌లో బంగారం 10 గ్రాములు (24 కేరట్లు) ధర రూ.40240 వద్ద ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. అదే సమయంలో ముంబై మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు రూ. 39851 వద్ద ట్రేడవగా, చెన్నై మార్కెట్లో రూ.38850 తాకింది. అలాగే విజయవాడ, వైజాగ్ మార్కెట్లలో సైతం రూ. 39850 వరకూ తాకింది. ఇక 22 కేరట్ల బంగారం ధర మాత్రం హైదరాబాద్‌లో రూ.3,6850 వద్ద ట్రేడవుతోంది. అటు అంతర్జాతీయంగా చూసినప్పటికీ బంగారం ఔన్సు ధర 1530 డాలర్లు పలుకుతోంది. మరోవైపు రూపీ పతనం సైతం బంగారం ధరల పెరుగుదలకు దారి తీసింది.

డాలర్ కు ప్రతిగా రూపాయి 72 వరకూ పతనం కావడంతో ఆ ప్రభావం బంగారంపై నేరుగా పడుతోందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మాంద్యం  మరోవైపు అతి త్వరలోనే బంగారం ధర రూ.52000 తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న ఫెస్టివల్ సీజన్ లో బంగారం ధరలు సామాన్యులకు అందనంత దూరంలో నిలవడం ఖాయమని చెబుతున్నారు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>