పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ఏపీలో పెట్రోల్ అమ్మకాలకు షార్ట్ బ్రేక్...

Pulwama Attack Update : పుల్వామా ఉగ్ర దాడిని దేశమంతా ఖండించింది. పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా ప్రజలు వివిధ మార్గాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. ఏపీలో పెట్రోల్ బంకులు కూడా తమదైన శైలిలో నిరసన తెలుపుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: February 20, 2019, 11:19 AM IST
పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ఏపీలో పెట్రోల్ అమ్మకాలకు షార్ట్ బ్రేక్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తు ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం రాత్రి 7 గంటల నుంచీ 20 నిమిషాల పాటూ పెట్రోల్ అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జవాన్ల వీరమరణాలకు సంతాపంగా కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్, ఏపీఎఫ్‌పీటీ కలిసి జాతీయ స్థాయిలో తమ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు. అందువల్ల ఆ 20 నిమిషాల్లో పెట్రోల్ కోసం ఎవరు బంకులకు వచ్చినా, అమ్మకాలు జరగవని ఆయన వివరించారు. ప్రజలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకొని... తమకు సహకరించాలని కోరారు.

స్థిరంగా పెట్రోల్ ధరలు : దేశీయంగా ఆరు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.24 శాతం తగ్గి, 66.29 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.23 శాతం తగ్గి 56.32 డాలర్లకు చేరింది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71 ఉండగా... డీజిల్ ధర రూ.66.17గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.76.64 ఉండగా.. డీజిల్ రూ.69.30 గా నమోదైంది.

హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.75.34గా ఉంది. డీజిల్ ధర రూ.71.95 దగ్గర కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.75.12 ఉండగా... డీజిల్‌ ధర రూ.71.33 గా నమోదైంది. 

ఇవి కూడా చదవండి :

రూ.5 లక్షలిస్తా... ప్రమోషన్ కోసం లంచం ఆఫర్... సస్పెండ్ అయిన ఉద్యోగి

ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...


పడక సుఖానికి దివ్య ఔషధం యాలకులు... ఎలా వాడాలంటే...

First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>