Home /News /business /

TO ENSURE YOU LOOSEN THE PURSE STRINGS THE RIGHT WAY FOLLOW THESE SIMPLE TIPS GH SSR

Financial Planning: థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు.. ఇబ్బంది పడకుండా డబ్బులను ఇలా జాగ్రత్త చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు రాకుండా స్మార్ట్, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను అనుసరించాలని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు కొన్ని మార్గాలను సైతం సూచిస్తున్నారు. అవేంటంటే..

2020లో ఎవరూ ఊహించని సంక్షోభం ఎదురైంది. కరోనా మహమ్మారి విరుచుకుపడింది. లక్షలాది మందిని బలితీసుకుంది. కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ప్రజలను కరోనా ఆర్థికంగా దెబ్బతీసింది. ఆరోగ్యం కంటే మరేదీ ముఖ్యం కాదని మరోసారి గుర్తుచేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థికంగా సిద్దంగా ఉండాలని కరోనా మహమ్మారి గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు రాకుండా స్మార్ట్, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను అనుసరించాలని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు కొన్ని మార్గాలను సైతం సూచిస్తున్నారు. అవేంటంటే..

* కార్పస్ ఫండ్
అత్యవసర సమయాల్లో లిక్విడ్ ఆస్తుల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, లేదా వాటిపై రుణాలను పొందడం ద్వారా ఆర్థిక అత్యవసర (Financial Emergencies) పరిస్థితులను ఎదుర్కోవచ్చు. దీనికి తోడు మూడు నుంచి ఆరు నెలల నెలవారీ ఖర్చులకు అవసరమయ్యే మొత్తాన్ని రిజర్వ్ ఫండ్‌గా ఉంచుకోవాలి. ఆరు నుంచి 12 నెలలకు సరిపడేలా ఈ నిధులను రిజర్వు చేసుకుంటే మరీ మంచిది.

ఇంటి అద్దె, ఈఎంఐలు, పిల్లల ఫీజులు, ఇతర కిరాణా ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తాన్ని లెక్కించాలి. 10 శాతం నగదు, 20 శాతం బ్యాంక్ బ్యాలెన్స్, 70 శాతం స్వల్పకాలిక లిక్విడ్ లేదా తక్కువ నష్ట భయం ఉన్న పెట్టుబడులుగా మొత్తం నిధులను పెట్టుబడి పెట్టాలి. బ్యాంకు డిపాజిట్లు, ఫండ్స్ కొంత ఆదాయాన్ని అందిస్తాయి. అవసరమైన వెంటనే వీటిని నగదుగా మార్చుకోవచ్చు.

* ఆరోగ్య, జీవిత బీమా తప్పనిసరి
పెరుగుతున్న ఖర్చులను పరిగణనలోకి తీసుకుని జీవిత బీమా, ఆరోగ్య బీమా తీసుకోవాలి. యాడ్ ఆన్ రైడర్ల ద్వారా ఆరోగ్య బీమాను గరిష్ఠంగా తీసుకోవాలి. ఇక జీవిత బీమాలో టర్మ్ ఫ్లాన్ తప్పనిసరి. వార్షిక ఆదాయానికి 10 నుంచి 12 రెట్లు కవరేజీ ఉండేలా టర్మ్ ఫ్లాన్ తీసుకోవాలి.

* రుణాల నిర్వహణ
తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే విధంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. అలా లేకుంటే పొదుపు లక్ష్యాలు దెబ్బతింటాయి. అత్యవసరమైతేనే రుణాలు తీసుకోవాలి. నెలవారీ ఈఎంఐలు నెలవారీ జీతంలో 30 శాతం దాటకుండా చూసుకోవాలి. రుణాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవచ్చు. దీని వల్ల క్రెడిట్ స్కోరు కూడా పెరుగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ వల్ల క్రెడిట్ ట్రాక్ సరిగా ఉంటుంది. ఏవైనా పెట్టుబడుల్లో లాభాలు, బోనస్ వస్తే అధిక వడ్డీ అప్పులు తీర్చివేయండి.

ఇది కూడా చదవండి: Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే..

* సేవింగ్స్ పెంచుకోవాలి
మీ పొదుపు సామర్థ్యం మీ ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అత్యవసర నిధి ఏర్పాటు, రుణాలు తిరిగి చెల్లించడం, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడంలాంటి వాటిపై ఈ ఆర్థిక లక్ష్యాలు ఆధారపడి ఉంటాయి. చేతికొచ్చే జీతంలో కనీసం 20 శాతం పొదుపు చేయాలి. మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఇది ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఆటో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (Auto Investment Plan) ద్వారా ప్రతి నెలా కొంత మొత్తం ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు పెట్టుబడిగా పెట్టండి. దీని వల్ల ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది.

మీ శక్తి సామర్ధ్యాలను, హాబీలను డబ్బు సంపాదించేందుకు ఉపయోగించండి. త్వరగా పదవీ విరమణ చేసి, విలాసవంతమైన జీవితం గడపాలంటే అధిక పొదుపు, వివేకవంతమైన పెట్టుబడితోనే సాధ్యమవుతుంది. తెలివిగా పొదుపు చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతారు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Business, Corona third wave, Financial Planning, Saving money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు