TO AVOID PREVENT MISUSE DOWNLOAD MASKED AADHAAR CARD BY USING THESE SIMPLE STEPS NS
Masked Aadhaar Download Steps: మాస్క్డ్ ఆధార్ తో మీ విలువైన డేటా సేఫ్.. ఈ సింపుల్ స్టెప్స్ తో చిటికెలో డౌన్ లోడ్ చేసుకోండిలా
ప్రతీకాత్మక చిత్రం
ఆధార్ కార్డు (Aadhar) దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా UIDAI మాస్క్డ్ ఆధార్ ను తీసుకువచ్చింది. మాస్క్డ్ ఆధార్ ను ఈ సింపుల్ స్టెప్స్ తో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలానో తెలుసుకోండి.
ప్రస్తుతం మన దేశంలో అతి ముఖ్యమైన ధ్రువపత్రంగా ఆధార్ కార్డు (Aadhar Card) మారిపోయింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ఆధార్ (Aadhar) నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు అందాలన్నా, సబ్సిడీలు పొందాలన్నా.. ఆధార్ అతి ముఖ్యమైన ధ్రువపత్రం. కరోనా సమయంలో పరీక్షలు చేయాలన్నా.. చివరికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి కూడా ఆధార్ అవసరంగా మారింది. అయితే.. ఇంతటి ముఖ్యమైన ఆధార్ కార్డు ను కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఆధార్ ను కనీస జాగ్రత్తలు పాటిస్తూ వినియోగించాలని సూచిస్తోంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సైతం ఆధార్ వినియోగంలో మోసాలను అరికట్టేందుకు మాస్క్డ్ ఆధార్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మాస్క్డ్ ఆధార్ పై మీ ఆధార్ కార్డులోని చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా అంకెలు ఉండాల్సిన చోట ******** గుర్తులు ఉంటాయి. అయితే.. ఈ కార్డు పొందాలంటే మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ ఇంట్లో నుంచే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Step 5: తర్వాత Download Aadhar అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. Step 6: అనంతరం మీ పేరు, ఫొటో, చిరునామా కనిపిస్తుంది. ఈ పేజీలో పైన Do you want a masked Aadhaar? అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానికి సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం కింద Download ఆప్షన్ కనిపిస్తుంది. Step 7: తర్వాత మీ మాస్క్డ్ ఆధార్ పీడీఎఫ్ డౌన్ లోడ్ అవుతుంది. ఆ పీడీఎఫ్ ను ఓపెన్ చేయాలంటే ఎనిమిది అంకెల పాస్డర్డ్ నమోదు చేయాల్సి ఉంటుంది. Aadhaar Card: ఆధార్ కార్డ్ ఒరిజినలేనా? వెరిఫై చేయడానికి అనేక మార్గాలు
Step 8: పాస్వర్డ్ ఏంటో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లలో తర్వాత మీరు పుట్టిన సంవత్సరం.. మొత్తం ఈ ఎనిమిది అంకెలను నమోదు చేయాలి. అదే మీ పాస్వర్డ్. ఉదాహరణకు మీ పేరు ANISH KUMAR, మీరు పుట్టిన సంవత్సరం 1989 అయితే.. మీ పాస్వర్డ్ ANIS1989. Step 9: పైన సూచించిన విధంగా మీరు పాస్వర్డ్ నమోదు చేయగానే మీ మాస్క్డ్ ఆధార్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకుని వాడుకోవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం సాఫ్ట్ కాపీని సైతం భద్రపరుచుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.