HOME »NEWS »BUSINESS »titan company launches indias first contactless payment watches with state bank of india ss

SBI Titan Contactless Payment: ఈ టైటాన్ వాచ్‌తో పేమెంట్ చేయొచ్చు

SBI Titan Contactless Payment: ఈ టైటాన్ వాచ్‌తో పేమెంట్ చేయొచ్చు
SBI Titan Contactless Payment: ఈ టైటాన్ వాచ్‌తో పేమెంట్ చేయొచ్చు (image: Titan)

SBI Titan Contactless Payment | మీరు ఎక్కడైనా పేమెంట్ చేయాలంటే కార్డు, స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. టైటాన్ వాచ్ ఉంటే చాలు. కాంటాక్ట్‌లెస్ పేమెంట్ కోసం కొత్త వాచ్‌లను తయారు చేస్తోంది టైటాన్.

  • Share this:
    ప్రస్తుత డిజిటల్ యుగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ మొబైల్ యాప్ ద్వారా కాంటాక్ట్ లెస్ పేమెంట్లను ప్రోత్సహిస్తుండగా, ఈ విభాగంలో ఎస్బీఐ మరో అడుగు ముందుకేసింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టైటాన్ కంపెనీతో జట్టు కట్టింది. ఎస్బీఐకి చెందిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో సహకారంతో టైటాన్ పే వాచ్లను విడుదల చేసేందుకు రెండు కంపెనీలు భాగస్వామ్యులుగా మారాయి. ఈ వాచ్‌లను కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసేందుకు అనుగుణంగా రూపొందించారు. అంటే ఇప్పుడు ఎస్బీఐ ఖాతాదారులు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా టైటాన్ పే వాచ్ సాయంతో పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) యంత్రాలపై కాంటాక్ట్లెస్ పేమెంట్ చేయొచ్చన్నమాట.

    PF Balance: తెలుగులో మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలా



    SBI Home Loan: గుడ్ న్యూస్... హోమ్ లోన్ EMI తగ్గించుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన ఎస్‌బీఐ


    ఈ ట్యాప్ అండ్ పే టెక్నాలజీ ద్వారా తమ వినియోగదారులు వినూత్న షాపింగ్ అనుభూతి పొందొచ్చని ఎస్బీఐ, టైటాన్ సంయుక్తంగా ప్రకటించాయి. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల కాలం నడుస్తున్నందున ఇలాంటి కొత్త రకం సాంకేతిక ఇంకా ఎక్కువగా అందుబాటులోకి రానుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెబుతున్నారు. ఈ సదుపాయాన్ని పొందడానికి వినియోగదారులు యోనో యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం యోనోకు 26 మిలియన్లమంది వినియోగదారులు ఉన్నారు. పిన్ నమోదు చేయకుండా రూ.2,000 వరకు చెల్లింపులు చేయవచ్చని ఎస్బీఐ తెలిపింది. వాచ్లో ఎన్‌ఎప్‌సీ (నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) చిప్ అమర్చి ఉంటుంది. దీన్ని ట్యాపీ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ చిప్ కాంటాక్ట్ లెస్ పేమెంట్‌కు సంబంధించిన భద్రతను పటిష్టం చేస్తుంది. మాస్టర్ కార్డ్ యాక్సెస్ ఉన్న అన్ని రకాల పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాల వద్ద టైటాన్ పే వాచ్ సేవలను వినియోగించుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:September 17, 2020, 15:28 IST

    टॉप स्टोरीज