హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tirumala Darshanam: శ్రీవారి భక్తులకు శుభవార్త... తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ సులువుగా పొందండి ఇలా

Tirumala Darshanam: శ్రీవారి భక్తులకు శుభవార్త... తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ సులువుగా పొందండి ఇలా

Tirumala Darshanam: శ్రీవారి భక్తులకు శుభవార్త... తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ సులువుగా పొందండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Tirumala Darshanam: శ్రీవారి భక్తులకు శుభవార్త... తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ సులువుగా పొందండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Tirumala Darshanam | తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను (Seegra Darshan Tickets) సులువుగా పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ఫాలో అయితే దర్శనం గురించి టెన్షన్ ఉండదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Tirupati | Visakhapatnam

తిరుమలలో (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనం, రూమ్ బుకింగ్ గురించి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ముందుగానే తిరుమల దర్శనం టికెట్స్ (Tirumala Darshanam Tickets) బుక్ చేసుకున్నవారికి ఇబ్బంది లేదు. కానీ తిరుపతికి (Tirupati) వెళ్లాక దర్శనం ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటే ఇబ్బందులు తప్పవు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి. నేరుగా తిరుమల కొండపైకి వెళ్లి క్యూలో దర్శనానికి వెళ్లొచ్చు. భక్తులు కంపార్ట్‌మెంట్లలో ఎదురుచూడాల్సి ఉంటుంది. లేదా సర్వదర్శనం టోకెన్లు తీసుకొని టైమ్ స్లాట్ ప్రకారం దర్శనానికి వెళ్లొచ్చు. గతంలో మెట్ల మార్గంలో వెళ్లేవారికి దివ్యదర్శనం టోకెన్లు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతానికి దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వట్లేదు.

ఇక ఇవి కాకుండా శీఘ్రదర్శనం కోసం రూ.300 టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా తిరుమల వెళ్లి రూ.300 టికెట్లు బుక్ చేసుకోవడం కుదరదు. ఆన్‌లైన్‌లోనే శీఘ్రదర్శనం టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. అయితే శ్రీవారి భక్తులు సులువుగా రూ.300 దర్శనం టికెట్లు పొందడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

IRCTC Tirupati Tour: విశాఖపట్నం నుంచి తిరుపతి 3 రోజుల టూర్ ... ప్యాకేజీ వివరాలివే

RTC Bus Tickets: తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లేవారికి రూ.300 శ్రీఘ్రదర్శనం టికెట్లను ఇస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాలనుకుంటే టీఎస్ఆర్‌టీసీ బస్ టికెట్ బుక్ చేశారనుకుందాం. వారికి రూ.300 శ్రీఘ్రదర్శనం టికెట్ కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా డబ్బులు చెల్లించి రూ.300 టికెట్ పొందొచ్చు. టీఎస్ఆర్‌టీసీ, ఏపీఎస్ఆర్‌టీసీ మాత్రమే కాదు, కర్నాటక ఆర్‌టీసీ, తమిళనాడు ఆర్‌టీసీ కూడా ప్రయాణికులకు బస్ టికెట్లతో పాటు రూ.300 టికెట్లు అందిస్తున్నాయి. ఇక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

IRCTC: ఇక ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం కూడా పలు టూర్ ప్యాకేజీలపై శ్రీఘ్రదర్శనం ఏర్పాట్లు చేస్తోంది. టూర్ ప్యాకేజీ ధరలోనే శ్రీఘ్రదర్శనం టికెట్ కలిపి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు శీఘ్రదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tourism Packages: తెలంగాణ టూరిజం, ఆంధ్రప్రదేశ్ టూరిజం సంస్థలు కూడా శీఘ్రదర్శనం టికెట్లను కలిపి తిరుమల టూర్ ప్యాకేజీలు అందిస్తున్నాయి. పర్యాటకులు టీఎస్‌టీడీసీ, ఏపీటీడీసీ టూర్ ప్యాకేజీల బుక్ చేసుకున్నవారు తిరుమలలో శీఘ్రదర్శనం క్యూ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Blood Donation: తిరుమలలో రక్తదానం చేసే భక్తులకు ఉచితంగా శీఘ్రదర్శనం లభిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రీహ్యాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ ఉంది. అక్కడ రక్తదానం చేసిన భక్తులకు శీఘ్ర దర్శనం ఉచితంగా లభిస్తుంది. ఒక రోజులో మొదటి 10 మందికే ఈ అవకాశం ఉంటుంది.

IRCTC Tirupati Tour: తిరుపతి సమీపంలోని ఆలయాలు చూసేందుకు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

VIP Letters: ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్ బుక్ చేసుకోలేకపోయిన భక్తులు, తిరుమలలో ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో శీఘ్రదర్శనం టికెట్లు పొందొచ్చు. ప్రజా ప్రతినిధుల రికమెండేషన్ లెటర్లతో వచ్చిన భక్తులకు ఇవ్వడానికి కొన్ని శీఘ్రదర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి.

First published:

Tags: Apsrtc, IRCTC Tourism, Tirumala, Tirupati, Tsrtc

ఉత్తమ కథలు