Tiktok ప్రధాన కార్యాలయం లండన్‌కు బదిలీ చేయడానికి బ్రిటన్ మంత్రి మండలి ఆమోదం...

తాజాగా బ్రిటిష్ మంత్రులు ఆమోదించిన ఒప్పందం ప్రకారం, బైట్‌డాన్స్ తన ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుండి లండన్ కు బదిలీ చేయనుందని సూత్రప్రాయంగా తెలుస్తోంది.

news18-telugu
Updated: August 3, 2020, 10:41 PM IST
Tiktok ప్రధాన కార్యాలయం లండన్‌కు బదిలీ చేయడానికి బ్రిటన్ మంత్రి మండలి ఆమోదం...
TikTok
  • Share this:
భారతదేశంతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాలలో టిక్‌టాక్ నిషేధించన తరువాత, దాని యజమాని సంస్థ బైట్‌డాన్స్ చైనా నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన వార్త తెలిసిందే. అయితే తాజాగా బ్రిటిష్ మంత్రులు ఆమోదించిన ఒప్పందం ప్రకారం, బైట్‌డాన్స్ తన ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుండి లండన్ కు బదిలీ చేయనుందని సూత్రప్రాయంగా తెలుస్తోంది. బైట్ డాన్స్ వ్యవస్థాపకుడు లండన్లోని తమ ప్రధాన కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ది సన్ వార్తాపత్రిక తెలిపింది.

మరోవైపు అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన కూడా బైట్ డాన్స్ ను కలవరానికి గురి చేస్తోంది. చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం బైట్‌డాన్స్ నుంచి ప్రముఖ షార్ట్-వీడియో యాప్ టిక్‌టాక్‌ను సొంతం చేసుకునేందుకు తన చర్చలను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్ప్ ఆదివారం తెలిపింది. ఈ చర్చను వచ్చే సెప్టెంబర్ 15 లోగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల, అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్ మధ్య సంభాషణ తరువాత, యునైటెడ్ స్టేట్స్ లో కొనుగోలు చర్చను కొనసాగించడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉంది "అని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ చర్చకు చైనాకు చెందిన బైట్ డాన్స్‌కు 45 రోజులు సమయం ఇవ్వడానికి ట్రంప్ అంగీకరించారని, తద్వారా కంపెనీ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌తో టిక్‌టాక్ అమ్మకంపై చర్చలు జరపగలదని ఈ విషయంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం చెప్పారు.

మైక్రోసాఫ్ట్ కు టిక్ టాక్ అమ్మాలనే ఆలోచనను తిరస్కరిస్తే మాత్రం అమెరికాలో ఈ యాప్ ని నిషేధించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ శుక్రవారం చెప్పారు. టిక్ టాక్ కొనుగోలు చేయడంలో మైక్రోసాఫ్ట్ విజయవంతమైతే, ఫేస్ బుక్ , స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలకు ఇది ప్రధాన పోటీదారు అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్‌వర్క్ లింక్డ్ ఇన్ ను కలిగి ఉంది.
Published by: Krishna Adithya
First published: August 3, 2020, 10:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading