Home /News /business /

Tiktok పోటీ యాప్ Chingari కొత్త రికార్డు..షాక్‌లో చైనా కంపెనీలు....

Tiktok పోటీ యాప్ Chingari కొత్త రికార్డు..షాక్‌లో చైనా కంపెనీలు....

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

భారత్ తో పాటు యుఎఇ, యుఎస్, కువైట్, సింగపూర్, సౌదీ అరేబియా, వియత్నాం దేశాలలో Chingari ని వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కంపెనీ తెలిపింది. కాగా చింగారి యాప్ వినియోగదారుల్లో అత్యధిక శాతం 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులే ఉండటం గమనార్హం.

ఇంకా చదవండి ...
    Tiktok కు ప్రత్యామ్నాయంగా వచ్చిన భారతీయ షార్ట్-వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ‘Chingari ’ కేవలం మూడు నెలల్లోనే తన ప్లాట్ఫామ్లో 30 మిలియన్లకు పైగా వినియోగదారులను సొంతంచేసుకుంది.
    భారతదేశంలో టిక్టాక్ మరియు ఇతర చైనీస్ యాప్లను నిషేధించిన 24 గంటల్లోనే Chingari  యూప్ 3.5 మిలియన్లకు పైగా డౌన్ లోడ్లను పొంది రికార్డు సృష్టించింది. "Chingari యాప్ డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్యలో పెరుగుదల మేము అందించే అడ్వాన్సుడ్ టూల్స్ పై   డిపెండ్ అయి ఉంటుంది. మేము మా కంటెంట్ క్రియేటర్స్ కు అద్భుతమైన వీడియో మరియు ఆడియో ఎడిటింగ్ టూల్స్ ను అందిస్తున్నాం.

    విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఉత్తమ భారతీయ ఫిల్టర్లను ఉపయోగించి యాప్ ను అద్భుతంగా డెవలప్ చేశాం." అని చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ సుమిత్ ఘోష్ అన్నారు. కంటెంట్ క్రియేటర్స్ కోసం మరింత అడ్వాన్సుడ్ ఫ్రంట్ మరియు రియర్ కెమెరా టూల్స్ తో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్లను ఉపయోగించామని ఆయన పేర్కొన్నారు. "చింగారి నూతనంగా తీసుకొచ్చిన ప్రత్యేకమైన ఏఆర్ ఫిల్టర్లు మరియు ప్రజలు ఇష్టపడే మరింత ఆసక్తికరమైన వీడియో ఎడిటింగ్ ఫీచర్లతో మార్కెట్లో దూసుకురావడానికి సిద్ధంగా ఉంది" అని ఘోష్ చెప్పారు.

    Chingari కంటెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషలతో పాటు హిందీ, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం, ఒడియా మరియు తెలుగు భాషలతో కలిపి మొత్తం 10 భాషలలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

    భారత్ తో పాటు యుఎఇ, యుఎస్, కువైట్, సింగపూర్, సౌదీ అరేబియా, వియత్నాం దేశాలలో Chingari ని వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కంపెనీ తెలిపింది. కాగా చింగారి యాప్ వినియోగదారుల్లో అత్యధిక శాతం 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులే ఉండటం గమనార్హం. గత వారం Chingari  టి-సిరీస్ మ్యూజిక్ సంస్థతో మ్యూజిక్ లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం ఫలితంగా భారతదేశం, ఇతర సార్క్ దేశాలు మరియు మిడిల్ ఈస్ట్లో చింగారి వినియోగదారులందరికీ టి–-సిరీస్ మ్యూజిక్ కలెక్షన్కు యాక్సెస్ లభిస్తుంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Technology, Tik tok

    తదుపరి వార్తలు