టిక్ టాక్ బ్యాన్‌తో రోజుకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా ? చైనా కంపెనీ గగ్గోలు...

ఇండియాలో దాదాపు 30 కోట్ల మంది యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారంటే దీని క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా టిక్ టాక్ వంద కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రముఖ అనలిటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ టిక్ టాక్ డౌన్ లోడ్స్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా గ్రోత్ సాధించిన యాప్ గా గుర్తించింది.

news18-telugu
Updated: April 23, 2019, 6:35 PM IST
టిక్ టాక్ బ్యాన్‌తో రోజుకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా ? చైనా కంపెనీ గగ్గోలు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 6:35 PM IST
వివాదాస్పద టిక్ టాక్ యాప్ భారత్‌లో బ్యాన్ చేయడంతో ప్రముఖ చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ రోజుకు 5 లక్షల డాలర్లు అంటే దాదాపు మూడున్నర కోట్ల రూపాయల ఆదాయం నష్టపోతోంది. టిక్ టాక్ ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందడంతో పాటు, ప్లే స్టోర్ లో టాప్ డౌన్ లోడ్స్ తో దూసుకెళ్లింది. ఆడియో,వీడియో ఎడిటింగ్ యాప్ గా ముందుకు వచ్చిన టిక్ టాక్, అటు స్మార్ట్ ఫోన్ సెల్ఫీ ఫీవర్‌కు మరింత బూస్ట్‌ను ఇచ్చింది. ఇండియాలో దాదాపు 30 కోట్ల మంది యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారంటే దీని క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా టిక్ టాక్ వంద కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రముఖ అనలిటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ టిక్ టాక్ డౌన్ లోడ్స్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా గ్రోత్ సాధించిన యాప్ గా గుర్తించింది.

ఇదిలా ఉంటే ఈ నెల మొదటి వారంలో భారత్ లో టిక్ టాక్ యాప్ ను నిషేధిస్తూ కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ బ్యాన్ చేసింది. ప్లే స్టోర్ లోనూ, ఇతర ఏ తరహా ప్లాట్ ఫామ్స్ లో టిక్ టాక్ యాప్‌ను తొలగించాలని ఆదేశించింది. దీంతో గూగుల్ తమ ఇండియన్ ప్లే స్టోర్ నుంచి టిక్ టాక్ ను తొలగించింది. ముఖ్యంగా పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా టిక్ టాక్ ఉందని ఫిర్యాదులు అందడంతో న్యాయ స్థానం యాప్ బ్యాన్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే టిక్ టాక్ సక్సెస్ ఇచ్చిన జోష్ తో భారత్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కూడా బైట్ డాన్స్ సంస్థ భావిస్తున్న తరుణంలో టిక్ టాక్ బ్యాన్ చేయడం శరాఘాతమనే చెప్పవచ్చు. ఈ బ్యాన్ విలువ రోజుకి మూడున్నర కోట్ల నష్టమని, అలాగే దాదాపు 250 మంది ఉద్యోగాలు ఎగిరిపోయే చాన్స్ ఉందని బైట్ డాన్స్ అంచనా వేస్తోంది.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...