Oakland Zoo: అమెరికా ఓక్లాండో జూలో వినూత్న ప్రయోగం.. జంతువులకు సైతం కరోనా వ్యాక్సిన్

ప్రతీకాత్మకచిత్రం

అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కో బే ఏరియా వద్ద ఉన్న ఓక్లాండో జూలో జంతువులకు సైతం కరోనా వ్యాక్సిన్​ వేస్తున్నారు. ప్రత్యేకంగా జంతువుల కోసం రూపొందించిన కరోనా టీకాలను జూలోని పులులు, ఎలుగుబంట్లు, సింహాలకు ఇస్తున్నట్లు అక్కడ వైద్య సేవలు అందించే డాక్టర్​ అలెక్స్​ హెర్మాన్​ వెల్లడించారు.

  • Share this:
కరోనా మహమ్మారి యావత్​ ప్రపంచాన్ని కుదిపేసింది. దీంతో చాలా దేశాలు కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సినేషన్​ డ్రైవ్​ చేపట్టాయి. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే కరోనా వ్యాక్సిన్లను ఇస్తుండటాన్ని విన్నాం. కానీ జంతువులకు సైతం కరోనా సోకుతుందన్న వార్తల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కో బే ఏరియా వద్ద ఉన్న ఓక్లాండో జూలో జంతువులకు సైతం కరోనా వ్యాక్సిన్​ వేస్తున్నారు. ప్రత్యేకంగా జంతువుల కోసం రూపొందించిన కరోనా టీకాలను జూలోని పులులు, ఎలుగుబంట్లు, సింహాలకు ఇస్తున్నట్లు అక్కడ వైద్య సేవలు అందించే డాక్టర్​ అలెక్స్​ హెర్మాన్​ వెల్లడించారు. జూలోని జంతువులను వాటి రోగనిరోధక శక్తి ఆధారంగా ఎంపిక చేసి దాని ప్రకారం టీకాలు ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీన్ని న్యూజెర్సీలోని జోయిటీస్​ అనే వెటర్నరీ ఫార్మాస్యూటికల్ సంస్థ ప్రత్యేకంగా జంతువుల కోసమే​ తయారు చేసినట్లు అలెక్స్​ హెర్మాన్​ తెలిపారు.

ఈ వ్యాక్సిన్ ప్రక్రియపై అలెక్స్ హర్మన్ మాట్లాడుతూ “మనుషుల వలే జంతువుల్లో కూడా కరోనా వైరస్​ వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. అందువల్ల కరోనా బారిన పడకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా వైరస్​కు వ్యతిరేకంగా జంతువులకు సైతం వ్యాక్సిన్​ అందజేస్తున్నాం. దీనికి అనుగుణంగానే తాజాగా ఓక్లాండ్ జంతుప్రదర్శనశాలలోని పులులు, ఎలుగుబంట్లు, సింహాలు, ఫెర్రెట్లకు రెండు డోసుల్లో మొదటి డోస్​ వ్యాక్సిన్​ వేశాం. త్వరలోనే ప్రైమేట్స్, పందులకు కూడా మొదటి డోస్​ వ్యాక్సిన్​ ఇవ్వనున్నాం. వ్యాక్సిన్​తో పాటు జంతువులు సామాజిక దూరం​ పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రొటెక్టివ్​ గేర్లను ఏర్పాటు చేశాం. ఈ టీకాలతో జూలోని జంతువులను బాగా రక్షించగలుగతున్నాం” అని వివరించారు.

జంతువుల వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసిన జోయిటిస్..​
జూలోని జంతువులను వాటి రోగ నిరోధక శక్తి ఆధారంగా ఎంపిక చేసి ప్రాధాన్యత క్రమంలో టీకాలను ఇస్తున్నట్లు డాక్టర్ అలెక్స్​ హెర్మాన్​​ తెలిపారు. జోయిటిస్​ సంస్థ ఇప్పటి వరకు 27 రాష్ట్రాల్లోని 70 జూలకు దాదాపు 11 వేల డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేసిందని పేర్కొన్నారు.

తమ ఓక్లాండో జూ తొలి విడతలో భాగంగా 100 డోసుల వ్యాక్సిన్ అందుకుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ జూలోని ఒక్క జంతువు కూడా కరోనా బారిన పడలేదని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వీటికి వ్యాక్సిన్లు ఇస్తున్నామని డాక్టర్​ అలెక్స్​ హెర్మాన్​ వెల్లడించారు.
Published by:Krishna Adithya
First published: