Home /News /business /

Motorola: భారత్‌లో విడుదల కానున్న మూడు కొత్త మోటొరోలా స్మార్ట్‌ఫోన్లు.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు మరెన్నో ఫీచర్లు

Motorola: భారత్‌లో విడుదల కానున్న మూడు కొత్త మోటొరోలా స్మార్ట్‌ఫోన్లు.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు మరెన్నో ఫీచర్లు

motorola Moto G71 5G (photo: Twitter)

motorola Moto G71 5G (photo: Twitter)

మోటొరోలా Moto G71 5G, Moto G51, బడ్జెట్ ధరలో లభించే Moto G31 స్మార్ట్‌ఫోన్‌లు గత వారం ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. దీంతో భారత్‌లో కూడా వీటిని లాంచ్ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

భారత మార్కెట్లోకి మోటొరోలా (Motorola) వరుసగా విభిన్న స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి Moto G71 5G, Moto G51, బడ్జెట్ ధరలో లభించే Moto G31 స్మార్ట్‌ఫోన్‌లు గత వారం ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. దీంతో భారత్‌లో కూడా వీటిని లాంచ్ (launch) చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు (news) వస్తున్నాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్-పవర్డ్ మోటో G200 5G, Moto G41 స్మార్ట్‌ఫోన్‌లను కూడా మోటొరోలా ఇటీవల విడుదల చేసింది. అయితే భారతదేశంలో వీటిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారనే వివరాలను మోటొరోలా (Motorola) అధికారింగా వెల్లడించలేదు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఒకే విధంగా ఉంటాయని..

Moto G71 5G, Moto G51 5G, Moto G31 డివైజ్‌లు భారత్‌కు చెందిన BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ పొందినట్లు కొన్ని నివేదికలు గుర్తించాయి. ఈ ఫోన్‌లకు XT2169, XT2171, XT2173 సర్టిఫికేషన్ నంబర్స్‌ కేటాయించినట్లు టిప్‌స్టర్స్ సైతం ధ్రువీకరించారు. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్‌లో లాంచ్ (launch) అయ్యే మోడళ్లలో ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఒకే విధంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా (Triple rear camera) సెటప్‌తో పాటు 5,000mAh బ్యాటరీతో రానున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు రూ. 25,200..

Moto G71 5G ధర EUR 299.99గా ఉంది. అంటే మన దేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు రూ. 25,200 ధర వద్ద లభ్యం కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో, 6.4 అంగుళాల ఫుల్ HD+ (1,080×2,400 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేతో రానుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో లభించే ఈ డివైజ్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్ ఉంటుంది. వెనుకవైపు ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.

మీడియాటెక్ హీలియో G85 చిప్‌సెట్‌తో..

Moto G51 5G మోడల్‌ను స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ ప్రైమరీ కెమెరాతో రూపొందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 6.8 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. దీని ధర EUR 229.99 (సుమారు రూ.19,300)గా ఉంది. Moto G31 ధర EUR 199.99 (రూ. 16,700) వరకు ఉంది. ఇది స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో, 6.4 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G85 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Latest Technology, Motorola, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు