హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax Savings Schemes: త్వరలో ఆర్థిక సంవత్సరం ముగింపు.. లాస్ట్ మినిట్ ట్యాక్స్ సేవింగ్ టిప్స్ ఇవే..

Tax Savings Schemes: త్వరలో ఆర్థిక సంవత్సరం ముగింపు.. లాస్ట్ మినిట్ ట్యాక్స్ సేవింగ్ టిప్స్ ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మరో నాలుగు రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఈ తక్కువ సమయంలో ఆదాయ పన్ను మినహాయింపు పొందడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Tax Savings Schemes:  2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. వీటిల్లో ఆదాయ పన్ను మినహాయింపు ముఖ్యాంశంగా మారింది. ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌లలో చేరితే పన్ను మినహాంపుల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. మరో నాలుగు రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఈ తక్కువ సమయంలో ఆదాయ పన్ను మినహాయింపు పొందడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.

* ఫిక్స్‌డ్ డిపాజిట్లు

భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చుకోవడంతో పాటు పన్ను మినహాయింపు పొందడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు సహకరిస్తాయి. ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేయడంతో ట్యాక్స్ పేయర్ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేసిన మొత్తానికి పన్ను వర్తించదు. దీంతో పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ట్యాక్స్‌పేయర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల వైపు చూస్తున్నారు.

ఈక్విటీ బేస్డ్ ట్యాక్స్ సేవింగ్స్ కన్నా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలో ఇన్వెస్ట్ చేయడంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దీర్ఘకాలంగా కాకుండా స్వల్ప కాల వ్యవధితో ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం 5 ఏళ్ల గడువుతో అందుబాటులో ఉండే ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో గ్యారంటీ రిటర్న్‌లతో పాటు నష్టభయం తక్కువగానే ఉంటుంది. పైగా, నెల నెల వడ్డీని పొందే సౌలభ్యం కూడా ఉంటుంది.

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

ఆదాయ పన్ను మినహాయింపు పొందడానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ మంచి మార్గం. 1968లో దేశంలో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. చిన్న మొత్తాల్లో పెట్టుబడి, పొదుపును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కీమ్‌ను డిజైన్ చేశారు. పీపీఎఫ్‌తో ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. 1961 ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ఈ సౌలభ్యం కల్పిస్తోంది.

స్వల్ప మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ రిటైర్‌మెంట్ నాటికి ప్రయోజనం పొందాలని భావించే వారికి పీపీఎఫ్ బాగా ఉపయోగపడుతుంది. పీపీఎఫ్‌ మెచ్యూరిటీ పూర్తయ్యాక వచ్చే రిటర్న్స్‌, వడ్డీలకు పన్ను వర్తించదు. దీంతో వీలైనంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి వేతనజీవులకు ఇదొక సులభమైన మార్గంగా మారింది. అయితే, ఏడాదికి రూ1.5లక్షల కన్నా ఎక్కువ పొదుపు చేస్తే ట్యాక్స్ ఎగ్జమ్షన్ ఉండదు. దీనిపై వడ్డీ కూడా రాదు.

Vande Bharat: జమ్మూ- శ్రీనగర్ మధ్య వందే భారత్ మెట్రో సర్వీస్.. త్వరలో ప్రారంభం

* నేషనల్ పెన్షన్ స్కీమ్

నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా వేతన జీవులకు పన్ను మినహాయింపు కల్పించే ఒక సేవింగ్స్ స్కీమ్‌గా ఉపయోగ పడుతుంది. అయితే, నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో రెండు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. టైర్ 1, టైర్ 2 అకౌంట్ అని రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టి రిటైర్‌మెంట్ అనంతరం లబ్ధి పొందాలంటే టైర్ 1లో చేరాల్సి ఉంటుంది. టైర్ 2లో స్వతంత్రంగా పొదుపు చేసుకునే వీలుంది. ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఉంటుంది.

* వీరికి మాత్రమే

18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న భారత పౌరులెవరైనా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. సెక్షన్ 80CCD(1) ప్రకారం నేషనల్ పెన్షన్ స్కీమ్ చందాదారులు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80CCE ఏడాదికి రూ.1.5లక్షల వరకు మినహాయింపు పొందే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. దీంతో పాటు చందాదారులు రూ.50 వేల వరకు చేసే అదనపు పెట్టుబడులపైనా పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, టైర్ 1 అకౌంట్స్‌లోనే ఈ పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80CCD(1B) ప్రకారం టైర్ 1లో రూ.50 వేల వరకు ఇన్వెస్ట్ చేసిన వారికి ఎడిషనల్ డిడక్షన్ వర్తిస్తుంది. టైర్ 1 అకౌంట్స్‌లలో పెట్టుబడి పెడితేనే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి అర్హత ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు.

First published:

Tags: Fixed deposits, Income tax, TAX SAVING

ఉత్తమ కథలు