Health Insurance: అందరికీ సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. సంపాదన, ఖర్చు, పొదుపును సక్రమంగా నిర్వర్తించకపోతే జీవితంలో కష్టాలు తప్పవు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులతో హెల్త్ ఇన్సూరెన్స్‌కి(Health insurance) కూడా కచ్చితంగా ఆర్థిక ప్రణాళికలో చోటు కల్పించాలి. హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ఖర్చు కవర్ చేయడమే కాకుండా, ఆరోగ్య సంబంధిత ఖర్చులను ఆదా చేస్తుంది. ఇప్పుడు డే-కేర్, OPD ఖర్చులు, ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌ల ఖర్చును కూడా పాలసీలు కవర్ చేస్తున్నాయి.
ఆరోగ్య సంబంధిత అత్యవసర పరిస్థితులు రాకపోతే.. అనవసరంగా ప్రీమియం కడుతున్నట్లు భావించవచ్చు. కానీ వైద్య చికిత్స ఎంత ఖరీదైనది అనే విషయాన్ని గమనిస్తే, ప్రీమియం చెల్లించడం మేలని తెలుస్తుంది. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం, ప్రీమియం, హాస్పిటల్ నెట్‌వర్క్, కవర్ చేస్తున్న జబ్బులు, క్యాష్‌లెస్ సర్వీస్, సాధారణ చికిత్స, ప్రసూతి, ముందుగా ఉన్న జబ్బులకు సంబంధించిన ఖర్చులను క్లెయిమ్ చేయడానికి వెయిటింగ్ పీరియడ్ వంటివి పరిశీలించాలి. అయితే పాలసీ తీసుకునే ముందు తప్పక పరిశీలించాల్సిన ఇతర అంశాలు మూడు ఉన్నాయి. కొందరు నిపుణుల సూచనల ఆధారంగా మనీ కంట్రోల్ న్యూస్ పోర్టల్ ఈ వివరాలను పబ్లిష్ చేసింది. అవేంటో తెలుసుకోండి.
* క్లెయిమ్స్
పాలసీ కొనే ముందు పరిశీలించాల్సిన ముఖ్యమైన అంశం క్లెయిమ్స్. పాలసీ అందించే నో-క్లెయిమ్ బోనస్, సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ చేయకుంటే, నో క్లెయిమ్ బోనస్ కవరేజీలో ఇంక్రీజ్‌లా కనిపిస్తుంది. ఇలా దీర్ఘకాలంలో పాలసీ సమర్థవంతంగా మారుతుంది. తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే, ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే తదుపరి కొన్ని సంవత్సరాలకు రెట్టింపు కవరేజీ లభిస్తుంది. Moneycontrol.com, SecureNow హెల్త్ ఇన్సూరెన్స్ రేటింగ్‌లను ప్రచురించాయి. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని తెలుసుకోవచ్చు. అంతిమంగా తీసుకునే పాలసీలు కుటుంబ ఆరోగ్య అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి.
* డిడక్టిబుల్స్, కో-పే(co-pay)
డిడక్టిబుల్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి ముందు చెల్లించాల్సిన (ఆసుపత్రి బిల్లు). ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్ అంగ్రిమెంట్‌లో పేర్కొంటారు. దీని ఆధారంగా ఆసుపత్రిలో చేరే ఖర్చుల కోసం కనీసం ఎంత డబ్బు ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకోవాలి. డిడక్టిబుల్స్‌ను ప్రతి సంవత్సరం చెల్లిస్తుంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకు తగినంత సేవింగ్స్ ఉన్నాయో? లేదో కూడా చూసుకోవాలి.
కో-పే కూడా ఇలానే ఉంటుంది. కానీ ఇది ప్రత్యేకంగా చెల్లించాల్సిన క్లెయిమ్‌లో కొంత శాతాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు చెల్లించాల్సి కో-పే బిల్లులో 10 శాతం కావచ్చు. మిగిలిన మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ముందు కో-పే చేయవలసిన అవసరం లేదు. యజమాని నుంచి పాలసీ కవర్ ఉంటే లేదా డిడక్టిబుల్, కో-పేని భరించే సేవింగ్స్ ఉంటే.. ప్రీమియం ఎక్కువగా ఉన్న పెద్ద కవర్‌లను కొనుగోలు చేయడంలో సహాయపడుతుంది.
* సబ్ లిమిట్స్
ఇవి కొన్ని విషయాలకు సంబంధించి ఎంత క్లెయిమ్ చేయవచ్చో తెలియజేస్తాయి. ఉదాహరణకు ఇన్సూరెన్స్ క్యాన్సర్ చికిత్సను కవర్ చేస్తుంది. అయినప్పటికీ సబ్ లిమిట్ ఉంటే, చికిత్సకు అయిన ఖర్చును పాక్షికంగా మాత్రమే క్లెయిమ్ చేయగలరు. పాలసీలో రూమ్ రెంట్ సబ్ లిమిట్ ఉంటే, కోరుకున్న గదికి అర్హులు కాకపోవచ్చు. సబ్ లిమిట్స్ బీమాదారు చెల్లింపును తగ్గించడంలో సహాయపడతాయి. బీమా చేసిన వ్యక్తి తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశాన్ని అందిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance, Insurance