వారానికి 3 రోజులు సెలవులు... ఉద్యోగులకు గుడ్ న్యూస్

వారానికి 3 రోజులు సెలవులు... ఉద్యోగులకు గుడ్ న్యూస్

Microsoft : మైక్రోసాప్ట్ జపాన్... వీకెండ్‌లో మూడు రోజులు వీకాఫ్‌లు (శుక్ర,శని,ఆది) ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

 • Share this:
  Microsoft : ప్రపంచంలో ఏ కార్పొరేట్ కంపెనీ చెయ్యని సాహసం మైక్రోసాఫ్ట్ చేసింది. ఎప్పటి నుంచో ఊహల్లో ఉన్న మూడు రోజుల వీకాఫ్‌ని నిజం చేసి చూపించింది. జపాన్‌లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ... 2,300 మంది ఉద్యోగులకు మూడు రోజులు వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ఎందుకంటే... చాలా మంది ఉద్యోగులు... కుటుంబ సభ్యులతో సరిగా గడపట్లేదట. పని, పని, పని అంటూ... పనిలోనే మునిగిపోతుంటే... మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని గ్రహించిన మైక్రోసాఫ్ట్ మేనేజ్‌మెంట్... మూడ్రోజులు వీకాఫ్ ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. అందులో భాగంగా... వర్కింగ్ రిఫార్మ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ప్రారంభించి... తమ ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారం వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఎల్లకాలం కాదు... ఒక్క నెల మాత్రమే. సాధారణంగా ఇలాంటి హాలిడేలు ఇచ్చేటప్పుడు కంపెనీలు... ఇతర హాలిడేల టైమ్‌లో పనిచెయ్యాలనే కండీషన్ పెడతాయి. మైక్రోసాఫ్ట్ అలాంటి కండీషన్ పెట్టట్లేదని చెప్పింది.

  మీకో డౌట్ రావచ్చు. వీకాఫ్‌లు పెంచితే... వర్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కదా అని. అంత లేదు. ఇది వరకటి కంటే... ఇప్పుడు జపాన్ మైక్రోసాఫ్ట్‌లో వర్క్ ప్రొడక్షన్ 39.9 శాతం పెరిగింది. ఇదెలా అంటే... ఇదివరకు మైక్రోసాఫ్ట్‌లో రోజూ ఏవో ఒక మీటింగ్‌లు, చర్చలు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు టైమ్ లేదన్న ఉద్దేశంతో అలాంటి వాటిని పక్కన పెట్టి పని చేస్తున్నారట. తప్పనిసరైతే... వాట్సాప్ వీడియో కాల్ లాంటి వాటిలో వర్చువల్ మీటింగ్స్ పెట్టుకొని టైమ్ సేవ్ చేసుకుంటున్నారు. టీ, కాఫీ అంటూ మాటిమాటికీ బయటకు వెళ్లకుండా... బుద్ధిగా పని చేసుకుంటున్నారు. అందువల్ల పని త్వరగా అయిపోవడమే కాదు... కంపెనీ వాడుతున్న ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా తగ్గుతోందట.

  ఈ ఆలోచన సక్సెస్ అవ్వడంతో... దీన్ని కంటిన్యూ చెయ్యడానికి మైక్రోసాఫ్ట్ ప్లాన్స్ వేస్తోంది. అదే జరిగితే... ఎల్లప్పుడూ వారంలో 3 రోజులు వీకాఫ్స్ ఇస్తే... ప్రపంచవ్యాప్తంగా మిగతా కంపెనీలు కూడా ఇదే రూట్ ఫాలో అయ్యే అవకాశాలున్నాయి. సైంటిఫిక్‌గా కూడా... మూడ్రోజుల వీకాఫ్ వల్ల ఉద్యోగులు మరింత శ్రద్ధగా పనిచేస్తారనీ, మెంటల్ టెన్షన్లు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఐతే... మైక్రోసాఫ్ట్ ప్రత్యేకమైన కంపెనీ అంటున్న కొందరు ఉద్యోగులు... ఇలాంటి రూల్స్ మిగతా కంపెనీల్లో సక్సెస్ అవ్వవని అంటున్నారు.

  జపాన్‌లో ఉద్యోగులకు పని భారం ఎక్కువ. ఉద్యోగుల సంతృప్తిని కంపెనీల యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగుల సంతృప్తి విషయంలో జపాన్ ఎప్పుడూ దిగువనే ఉంటోంది. అలాంటి దేశంలో మైక్రోసాఫ్ట్ ఇలాంటి ప్రయోగం చెయ్యడం గొప్ప విషయమేగా.

   

  Pics : క్యూట్ సింగర్ షిర్లీ సెషియా అందాలు
  ఇవి కూడా చదవండి :

  HBD Kohli : హ్యాపీ బర్త్‌డే కోహ్లీ... రికార్డుల రారాజుకి విషెస్

  Pics : ఢిల్లీలో పొగ ఎలా ఉందో ఈ ఫొటోలే చెబుతున్నాయి...


  ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తాజా ప్రకటన...

  నేడు తెలంగాణ బంద్?... నాగోలులో తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు

  మద్యం కొద్దికొద్దిగా తాగితే కలిగే లాభాలేంటి?
  First published: