Home /News /business /

THREAT TO RELIANCE INDUSTRIES CHAIRMAN MUKESH AMBANI UNIDENTIFIED MAN MADE PHONE CALL AND CLAIMING AS A TERRORIST SS

Mukesh Ambani: ముకేష్ అంబానీకి బెదిరింపులు... టెర్రరిస్టు పేరుతో ఫోన్ కాల్స్

Mukesh Ambani: ముకేష్ అంబానీకి బెదిరింపులు... టెర్రరిస్టు పేరుతో ఫోన్ కాల్
(File Photo: Mukesh Ambani)

Mukesh Ambani: ముకేష్ అంబానీకి బెదిరింపులు... టెర్రరిస్టు పేరుతో ఫోన్ కాల్ (File Photo: Mukesh Ambani)

Reliance Industries | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీతో పాటు (Mukesh Ambani), ఆయన కుటుంబాన్ని బెదిరిస్తూ ఓ వ్యక్తి టెర్రరిస్టు పేరుతో ఫోన్ కాల్స్ చేయడం కలకలం రేపుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
భారతదేశంలో దిగ్గజ వ్యాపారుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి (Mukesh Ambani) బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్‌కు ఫోన్ కాల్ చేసి, తాను నెంబర్ వన్ టెర్రరిస్ట్ అని, ముకేశ్ అంబానీ అంతుచూస్తానని బెదిరించడంతో పాటు ఎన్ఐఏ, ఏటీఎస్, ముంబై పోలీసులపై దుర్భాషలాడాడు. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి (Reliance Foundation Hospital) గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ముకేష్ అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని బెదిరించాడు.

రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి అధికారులు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. మొత్తం 8 ఫోన్ కాల్స్ వచ్చినట్టు విశ్వసనీయవర్గాలు CNN News18 కి తెలిపాయి. డీబీ మార్గ్ పోలీసులు ఈ ఫోన్ కాల్స్‌ని వెరిఫై చేస్తున్నారు. ఆంటిలియా భవనం బయట భద్రతను పెంచుతామని, ప్రైవేట్ భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే పెంచామని పోలీసు ఉన్నతాధికారులు CNN News18 కి తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు అఫ్జల్ అని చెప్పినట్టు తెలుస్తోంది.

ముంబై పోలీసుల సమాచారం ప్రకారం బెదిరించడం, చంపేస్తానని హెచ్చరించడం, దుర్భాషలాడటం లాంటి సెక్షన్లతో కేసు పెట్టామని, ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తి పదేపదే బెదిరింపులకు పాల్పడ్డాడని, తాను ముకేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. ఫోన్ కాల్ రికార్డుల్ని పోలీసులు విన్నారు. అయితే అతను మానసిక రోగి కావచ్చని లేదా ఏదైనా ఒత్తిడితో ఇలా బెదిరించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మానసిక ఒత్తిడితో ఉన్న వ్యక్తి తన కోపాన్ని వ్యక్తపరిచేందుకు పదేపదే కాల్స్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఫోన్ కాల్ చేసిన వ్యక్తి లొకేషన్ తెలుసుకునేందుకు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలు ఉన్న వాహనం ఆంటీలియా భవనం బయట కనుగొన్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను కొనసాగించాలని ఈ ఏడాది జూలైలో సుప్రీం కోర్టు అనుమతిస్తూ, త్రిపుర హైకోర్టు ముందు ఉన్న పిల్‌పై ప్రొసీడింగ్స్‌ని రద్దు చేసింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Mukesh Ambani, Reliance, Reliance Industries

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు