హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: హోమ్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా.. అవసరమైన డాక్యుమెంట్స్.. ఫాలో అవ్వాల్సిన స్టెప్స్..

Home Loan: హోమ్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా.. అవసరమైన డాక్యుమెంట్స్.. ఫాలో అవ్వాల్సిన స్టెప్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా ఐదు పని దినాలలో మీ లోన్ దరఖాస్తును ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనే దానిపై బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సొంతిల్లు వీలైనంత త్వరగా సొంతం చేసుకోవాలనే కల అందరిలో ఉంటుంది. ఈ కలను నెరవేర్చుకోవడం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు హోమ్ లోన్స్‌(Home Loans)పై అధికంగా ఆధారపడుతుంటారు. అయితే హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారు ముందుగా చాలా డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. దీంతోపాటు నిర్ణీత ప్రక్రియను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

* హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

ముందు మీకు నచ్చిన బ్యాంకును విజిట్ చేసి, హోమ్ లోన్ అప్లికేషన్ ఫారమ్‌ను ఫిల్ చేయాలి. ఈ ఫారమ్‌లో మీ పేరు, ఉద్యోగ వివరాలతో సహా మొత్తం సమాచారాన్ని అందించాలి. తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను నింపాక, బ్యాంక్‌ ప్రాసెసింగ్ ఫీజు(Bank Processing Fee) చెల్లించాలి. ఈ ఫీజును మీ వివరాలు వెరిఫై చేసేందుకు బ్యాంకు వసూలు చేస్తుంది. సాధారణంగా ఐదు పని దినాలలో మీ లోన్ దరఖాస్తును ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనే దానిపై బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది.

బ్యాంకుకు వివరాలన్నీ సమర్పించిన తర్వాత, మీ హోమ్ లోన్ ఎలిజిబిలిటీని చెక్ చేయడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ సమయంలో బ్యాంక్ అధికారులు మీ ఇంటికి రావచ్చు. మీరు అందించిన వివరాలను వెరిఫై చేసేందుకు మీ ఆఫీస్ లేదా యజమానిని కూడా సంప్రదించవచ్చు. అలానే మీ CIBIL స్కోర్, క్రెడిట్ కార్డ్ రిపోర్ట్ చెక్ చేయవచ్చు. అన్ని ఓకే అనుకుంటే.. మీ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ ముందుకెళ్తుంది. లేదంటే రిజెక్ట్ అవుతుంది.

* లోన్ ఓకే అయితే..?

హోమ్ లోన్ అప్లికేషన్ అప్రూవ్ అయితే బ్యాంక్ మీకు రుణ మొత్తం, వడ్డీ రేటు, వడ్డీ రకం, లోన్ కాలవ్యవధి, నిబంధనలు, షరతులు వంటి వివరాలను తెలియజేస్తూ ఒక మంజూరు లేఖను పంపుతుంది. మీరు ఆ లేఖను పూర్తిగా చదివి సంతకం చేసి దాని కాపీని బ్యాంకుకు పంపాలి. ఈ సమయంలో మీరు వన్‌టైమ్‌ సెక్యూర్ ఫీజు చెల్లించాలి. మీరు రుణం కోరుతున్న ఆస్తికి సంబంధించిన లీగల్, టెక్నికల్ చెక్‌ను బ్యాంక్ కొనసాగిస్తుంది. ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉందా అనేది చెక్ చేయడానికి బ్యాంక్ అధికారులను పంపుతుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక, మీరు లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. ఆపై బ్యాంక్ మీకు హోమ్ లోన్ అమౌంట్‌ను అందజేస్తుంది.

LPG Price Update: ఇది మామూలు వాయింపు కాదు భయ్యా.. ఏకంగా రూ.170 పెరిగిన సిలిండర్ ధర.. ఏడాదిలో 5 సార్లు పెంపు!

Gold: కేంద్రం దసరా శుభవార్త.. తాజా నిర్ణయంతో దిగిరానున్న బంగారం, వెండి, వంట నూనె ధరలు!

* రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్

హోమ్ లోన్ కోసం అప్లై చేసేవారు అడ్రస్ ప్రూఫ్‌గా ఎలక్ట్రిక్/టెలిఫోన్ బిల్లు, నీటి పన్ను, ఆస్తి పన్ను రసీదు తదితర వాటిలో ఏదో ఒకటి సమర్పించాలి. ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, పాన్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి వాటిలో ఏదో ఒక డాక్యుమెంట్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచనా వేసి అందించాలి. పోసెషన్ సర్టిఫికెట్, భూమి పన్ను రసీదు, బిల్డర్ లేదా విక్రేతకు చెల్లించిన పేమెంట్‌ను తెలిపే బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా రసీదు సమర్పించాలి. ఆల్రెడీ కట్టేసిన అపార్ట్‌మెంట్ల విషయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి.

జీతం పొందేవారు ఇన్‌కమ్ ప్రూఫ్‌గా ఫారమ్‌ 16, ఎంప్లాయర్ సర్టిఫైడ్ లెటర్, గత 2 నెలల పేస్లిప్‌లు, ప్రమోషన్/అప్రైజల్ లెటర్ వంటివి అందించాలి. స్వయం ఉపాధి పొందేవారు గత ఆరు నెలల బిజినెస్ ఎగ్జిస్టెన్స్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ల ప్రూఫ్‌గా సబ్మిట్ చేయాలి. ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్/ పాన్ కార్డ్/ బర్త్ సర్టిఫికెట్/ 10వ తరగతి మార్క్‌షీట్/బ్యాంక్ పాస్ బుక్/ డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేయాలి.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Home loans

ఉత్తమ కథలు