Mutual Fund: ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తే రూ.51 లక్షల రిటర్న్స్

Mutual Fund: ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తే రూ.51 లక్షల రిటర్న్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Mutual Fund Returns | మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తూ పోతే మంచి రిటర్న్స్ వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే మంచి మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటేనే రిటర్న్స్ ఎక్కువ పొందొచ్చు.

  • Share this:
    లక్షల రూపాయలు సంపాదించాలని అందరికీ ఉంటుంది. కానీ అందు కోసం ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ప్రతీ నెలా కొంత పొదుపు (Savings) చేయాలని మీరు అనుకుంటే తప్పనిసరిగా పొదుపు చేస్తూ ఉండాలి. మీకు ఎన్ని ఖర్చులు ఉన్నా ముందు పొదుపు చేసిన తర్వాత మిగతా డబ్బుల్ని ఖర్చు చేయాలి. ఇలా ఎక్కువ కాలంగా పాటు పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఇలా గత పదేళ్లలో మంచి రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) వివరాలను మనీకంట్రోల్ ఓ కథనంలో వివరించింది. మరి ఆ మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.10,000 చొప్పున 10 ఏళ్ల పాటు సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసినవారికి ఇప్పుడు మొత్తం రిటర్న్స్ ఎంత వచ్చాయో తెలుసుకోండి.

    ICICI Prudential Technology fund: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ గత పదేళ్లలో 27.8 రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసినవారికి ఇప్పుడు రూ.51.5 లక్షల రిటర్న్స్ వచ్చాయి. ఈ ఫండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం రూ.5,037 కోట్ల అసెట్స్ మేనేజ్ చేస్తోంది.

    Aadhaar Card Fraud: ఆధార్‌ కార్డు విషయంలో వెంటనే ఈ పనిచేయకపోతే మోసపోతారు జాగ్రత్త

    SBI Smallcap fund: ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ గత పదేళ్లలో 26.6 రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసినవారికి ఇప్పుడు రూ.48.3 లక్షల రిటర్న్స్ వచ్చాయి. ఈ ఫండ్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం రూ.9,714 కోట్ల అసెట్స్ మేనేజ్ చేస్తోంది.

    Nippon India Small Cap: నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ గత పదేళ్లలో 26.5 రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసినవారికి ఇప్పుడు రూ.48.1 లక్షల రిటర్న్స్ వచ్చాయి. ఈ ఫండ్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం రూ.16,633 కోట్ల అసెట్స్ మేనేజ్ చేస్తోంది.

    IMPS Transaction: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి అలర్ట్... లిమిట్ పెంచిన ఆర్‌బీఐ

    Aditya Birla Digital India fund: ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్ గత పదేళ్లలో 26.4 రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసినవారికి ఇప్పుడు రూ.48.03 లక్షల రిటర్న్స్ వచ్చాయి. ఈ ఫండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం రూ.2,288 కోట్ల అసెట్స్ మేనేజ్ చేస్తోంది.

    Mirae Asset Emerging Bluechip fund: మిరాయి అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ గత పదేళ్లలో 25.3 రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసినవారికి ఇప్పుడు రూ.45.2 లక్షల రిటర్న్స్ వచ్చాయి. ఈ ఫండ్ లార్జ్, మిడ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం రూ.20,615 కోట్ల అసెట్స్ మేనేజ్ చేస్తోంది.

    Disclaimer: ఈ ఫండ్స్ మా రికమండేషన్స్ కావు. ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి.
    Published by:Santhosh Kumar S
    First published: