news18-telugu
Updated: November 15, 2020, 12:38 AM IST
ప్రతీకాత్మకచిత్రం
బరువు తగ్గాలి అనుకునేవారికి ఆరోగ్య నిపుణులు, వైద్యులు ఆహారంతో సలాడ్స్ తినాలని సిఫార్సు చేస్తుంటారు. సలాడ్లు ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. పచ్చి కూరగాయలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రజలు తమ ఆహారంతో వివిధ కూరగాయలతో తయారుచేసిన సలాడ్ తీసుకుంటారు. కానీ మీరు ఎప్పుడైనా సలాడ్ వ్యాపారం గురించి ఆలోచించారా లేదా విన్నారా? వినకపోతే పోతే మాత్రం ఇది మీకు షాక్ అనుకోవచ్చు. పూనేకు చెందిన ఒక మహిళ తన సలాడ్ వ్యాపారంలో కేవలం 3000 రూపాయల పెట్టుబడిత పెట్టి...నేడు ఏటా 22 లక్షల ఆదాయం సంపాదిస్తోంది. పూణేకు చెందిన మేఘా బఫ్నా 3 సంవత్సరాల క్రితం 2017 లో సలాడ్ వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. దీంతో ఆమె తన వ్యాపారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది. ఆమె ఇంట్లోనే సలాడ్ సిద్ధం చేసి సోషల్ మీడియాలో షేర్ చేసేది. కానీ ఆమె ఆలోచన ఎంతో మందిని ఆకర్షించింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు సలాడ్ ఆర్డర్లు పొందడం ప్రారంభమైంది. ప్రారంభంలో ఆమె తన స్నేహితుల నుండి మాత్రమే ఆర్డర్లు పొందేది. స్నేహితులతో ప్రారంభించిన తరువాత, ఆమె వ్యాపారం నెమ్మదిగా ముందుకు సాగింది.
బఫ్నా తన సలాడ్ వ్యాపారాన్ని కేవలం 3000 రూపాయలతో ప్రారంభించింది. ఇప్పటివరకు సలాడ్ వ్యాపారం నుంచి సంవత్సరానికి రూ.22 లక్షలు సంపాదిస్తోంది. తెల్లవారుజామున 4.30 గంటలకు వారు లేచి కూరగాయలు తెచ్చి సలాడ్లను ఆమె ప్రిపేర్ చేస్తుంది. బఫ్నా లాభాలను సంపాదించడమే కాదు, తొలి నాళ్లలో నష్టపోయింది కూడా. కానీ వ్యాపారం అంటేనే లాభం నష్టం రెండింటి కలయిక. లేకపోతే మీకు విజయం రాదు.
వ్యాపారం మొత్తం వ్యవస్థ ద్వారా నడుస్తుంది
బాఫ్నా వ్యాపారం ఇప్పుడు పూర్తిగా ఒక వ్యవస్థపై పనిచేస్తుంది. ఆమె వ్యాపారం కూడా గణనీయంగా పెరిగింది. ఈ సమయంలో, వారి నెలవారీ లాభం రూ.75 వేల నుండి లక్ష రూపాయలు లభిస్తోంది. నష్టాలు ఉన్నప్పటికీ, బఫ్నా ధైర్యంతో విజయవంతమైన వ్యాపారవేత్తగా అవతరించింది.
వాట్సాప్ తో లాభాలు..
ఆమె సలాడ్లు అమ్మడానికి వాట్సాప్ ఉపయోగిస్తుంది. వాస్తవానికి సలాడ్లు తయారుచేయడం బఫ్నాకు చాలా ఇష్టం. ఈ అభిరుచిని తన వృత్తిగా మార్చుకుంది. ఇతరులకు సలాడ్ వడ్డించాలని కూడా నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఇది ఒక విజయవంతమైన వ్యాపారంగా మారింది. వాట్సాప్లో ఆర్డర్ చేయమని ప్రజలను ఆహ్వానిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ ఆమె వ్యాపారాన్ని నెమ్మదిగా పెంచుకోవడానికి సహాయపడింది.
Published by:
Krishna Adithya
First published:
November 15, 2020, 12:38 AM IST