Home /News /business /

THIS SUV HAS A WAITING PERIOD OF 4 YEARS FULL DETAILS HERE GH VB

Land Cruiser SUV: కరోనా ఎఫెక్ట్ .. ల్యాండ్ క్రూయిజర్ SUV డెలివరీపై కీలక ప్రకటన.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు చిప్‌సెట్ కొరత ఆటోమొబైల్ ఇండస్ట్రీని తీవ్రంగా కుదిపేస్తోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత పరిస్థితులు కొంచెం మెరుగుపడినప్పటికీ, తయారీ ఖర్చులు పెరగడంతో ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

కరోనా(Corona) మహమ్మారి ప్రభావంతో పాటు చిప్‌సెట్(Chipset) కొరత ఆటోమొబైల్ (Automobile Industry)ఇండస్ట్రీని తీవ్రంగా కుదిపేస్తోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత పరిస్థితులు కొంచెం మెరుగుపడినప్పటికీ, తయారీ ఖర్చులు పెరగడంతో ఇండస్ట్రీ(Industry) గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం అన్ని కార్ల తయారీ సంస్థలపై పడింది. జపాన్‌కు(Japan) చెందిన ఆటో మోటివ్ దిగ్గజం టయోటా కూడా మార్కెట్ పరిస్థితులకు తీవ్రంగా ప్రభావితమవుతోంది. సెమీకండక్టర్ల కొరత కారణంగా టయోటా ఇప్పటికే యాన్యువల్ ప్రొడక్షన్‌ లక్ష్యాలను మిస్సయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టయోటా అభివృద్ధి చేస్తున్న ‘ల్యాండ్ క్రూయిజర్‌’ ఎస్‌యూవీ తయారీ, ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ల్యాండ్ క్రూయిజర్ SUV డెలివరీ టైమ్ ఏకంగా 4 సంవత్సరాల వరకు ఉండవచ్చని సంస్థ ధ్రువీకరించింది. దీంతో ఈ టయోటా ఎస్‌యూవీ ఇప్పట్లో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశాలు లేవు.

Viral News: ఆ బుడతడు చేసిన పనికి మీరు షాక్ అవ్వాల్సిందే.. ఏకంగా రూ.1.4 లక్షలతో..


ల్యాండ్ క్రూయిజర్ SUVకి గ్లోబల్ మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వాహనాన్ని కంపెనీ గత సంవత్సరం ఆవిష్కరించింది. ఇది 2022లోనే భారత్‌లో విడుదల కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. కానీ ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో కంపెనీ ముందు బుకింగ్స్ తీసుకున్న ఆర్డర్ల డెలివరీపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయంపై టయోటా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘మా వాహనాలను పరిశీలించి, ఆర్డర్ చేసినందుకు ధన్యవాదాలు. జపాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ క్రూయిజర్‌కు మంచి ఆదరణ లభించింది. దీన్ని ఆర్డర్ చేసిన తర్వాత ల్యాండ్ క్రూయిజర్‌ను మీకు డెలివరీ చేయడానికి చాలా సమయం పడుతుందని తెలియజేస్తున్నాం.

దీనిపై మీకు క్షమాపణలు చెబుతున్నాం. మీరు ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీని ఇప్పుడు ఆర్డర్ చేస్తే, డెలివరీ పీరియడ్ 4 సంవత్సరాల వరకు ఉండవచ్చు. మా కస్టమర్ల కోసం డెలివరీ సమయాన్ని తగ్గించడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం’ అని టయోటా తెలిపింది. ఈ విషయాన్ని టయోటా అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఈ ప్రకటన విడుదల చేసిన తరువాత ఎస్‌యూవీని బుక్ చేసే కస్టమర్లకు 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని వెల్లడించింది.

Bank Locker Fee: బ్యాంక్ లాకర్లను ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ బ్యాంకుల లాకర్ ఛార్జీల వివరాలు ఇలా..


ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ సరికొత్త 3.5-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V6 ఆయిల్-బర్నర్‌లో వస్తుంది. ఇది మునుపటి 5.7 లీటర్ V8 ఇంజన్ కంటే శక్తివంతమైనది. కొత్త ఇంజన్ 403 bhp పవర్‌ను, 650 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కానీ పాత V8 సిస్టమ్‌ 30 bhp పవర్‌ను, 108 Nm టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ మేరకు కెపాసిటీని పెంచారు. ఈ ఇంజన్ సరికొత్త 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్ అయ్యి ఉంటుంది. ఈ SUV కేవలం 6.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.
Published by:Veera Babu
First published:

Tags: Automobiles, SUV, Tayota, Xuv

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు