Multibagger Share | మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో (Stock Market) భారీ రిస్క్ ఉంటుంది. కొన్ని షేర్లు (Stocks) నష్టాలను అందించొచ్చు. మరికొన్ని షేర్లు అదిరే లాభాలు అర్జించి పెట్టొచ్చు. అందువల్ల మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈ విషయాలు గుర్తించాలి. రిస్క్ ఉంటుందని తెలుసుకొని మార్కెట్లోకి దిగాలి. కొన్ని సందర్భాల్లో పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకపోవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.
అయితే ఇటీవల కాలంలో చాలా షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు అందించాయి. వీటిల్లో సిక్కో ఇండస్ట్రీస్ కూడా ఒకటి. ఈ షేరు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించింది. అంతేకాకుండా మరో బెనిఫిట్ కూడా కల్పించింది. బోనస్ షేర్లు ప్రకటించింది. ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్‌గా ఇచ్చింది. అంటే ఈ షేరులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు.
18 బ్యాంకుల కస్టమర్లను టార్గెట్ చేసిన ఆండ్రాయిడ్ వైరస్.. మీ అకౌంట్లోని డబ్బుల్ని ఎలా కొట్టేస్తుందంటే?
సిక్కో ఇండస్ట్రీస్ షేరు ఇన్వెస్టర్ల డబ్బును కేవలం 2 నెలల కాలంలోనే రెట్టింపు చేసింది. 2 నెలల్లో షేరు ధర 130 శాతం మేర ర్యాలీ చేసింది. 2022 ఆగస్ట్ 18న ఈ కంపెనీ షేరు ధర రూ. 58 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు షేరు ధర రూ. 143కు చేరింది. అంటే 2 నెలల కిందట ఈ షేరులో రూ.లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ. 1.46 లక్షల లాభం వచ్చేది. అంటే ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.లక్ష నుంచి రూ. 2.46 లక్షలకు చేరింది.
పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!
అలాగే సిక్కో ఇండస్ట్రీస్ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 172గా ఉంది. అలాగే 52 వారాల కనిష్ట స్థాయి రూ. 42గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ షేరు ధర గత ఏడాది కాలంలో ఏకంగా 270 శాతం ర్యాలీ చేసింది. 2021 అక్టోబర్ 22న ఈ షేరు ధర రూ. 38 వద్ద ఉండేది. ఇప్పుడు షేరు ధర రూ. 143కు చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే.. షేరు ధర 114 శాతం పైకి చేరింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 161 కోట్లుగా ఉంది.
సిక్కో ఇండస్ట్రీస్ అనేది అగ్రో కెమికల్స్ కంపెనీ. ఇది అగ్రికల్చర్ ప్రొడక్టులను తయారు చేస్తుంది. సాయిల్ కండీషనర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్, అగ్రికల్చర్ ఫంగిసైడ్స్ వంటి ప్రొడక్టులను విక్రయిస్తుంది. 2022 సెప్టెంబర్ నెల చివరి నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా ఏకంగా 71.43 శాతంగా ఉంది. కాగా బోనస్ షేరు నేపథ్యంలో ఇప్పుడు స్టాక్ ధర రూ. 100 వద్ద కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks