ఆ కంపెనీలో లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే...కోటీశ్వరులు అయ్యేవారు...ఎలాగో తెలుసా..?
జీఎంఎం గడిచిన పదేళ్లలో ఏకంగా 1000 శాతం రిటర్న్ ఇచ్చింది. 2009లో ఆ కంపెనీ షేర్ విలువ కేవలం 90 రూపాయలు, అయితే తాజాగా 2019లో ఆ కంపెనీ షేరు విలువ ఏకంగా రూ.1450 తాకింది. అంటే గత పది సంవత్సరాల్లో జీఎంఎం షేర్ విలువ ఏకంగా 1500 శాతం పెరిగింది.
news18-telugu
Updated: November 12, 2019, 4:59 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: November 12, 2019, 4:59 PM IST
GMM Pfaudler జీఎంఎం పీఫాడ్లర్(జీఎంఎం) అనే ఓ చిన్న స్మాల్ క్యాప్ కంపెనీల గడిచిన పదేళ్లలో షేర్ హోల్డర్లకు బంగారు బాతుగా మారింది. గ్లోబల్ కెమికల్ అండ్ ఫార్మాసుటికల్ ఇండస్ట్రీస్‌కు సప్లయర్ కంపెనీ అయిన జీఎంఎం గడిచిన పదేళ్లలో ఏకంగా 1000 శాతం రిటర్న్ ఇచ్చింది. 2009లో ఆ కంపెనీ షేర్ విలువ కేవలం 90 రూపాయలు, అయితే తాజాగా 2019లో ఆ కంపెనీ షేరు విలువ ఏకంగా రూ.1450 తాకింది. అంటే గత పది సంవత్సరాల్లో జీఎంఎం షేర్ విలువ ఏకంగా 1500 శాతం పెరిగింది. అంటే 2009 సంవత్సరంలో ఈ కంపెనీలో లక్ష రూపాయల పెట్టుబడితో సుమారు 1100 షేర్లను కొనుగోలు చేసి ఉంటే 2019 నాటికి అక్షరాలా కోటిన్నర రూపాయలు సొంతం అయి ఉండేవి. జీఎంఎం సంస్థ గ్లాస్ లైన్డ్ స్టీల్ ఎక్విప్ మెంట్ తయారీలో మంచి పేరు సంపాదించింది. అలాగే అగ్రో కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మా సెక్టార్ లకు అనుబంధ సంస్థగా జీఎంఎం పీ ఫాడ్లర్ సంస్థ పనిచేస్తుంది. ఈ స్మాల్ కాప్ కంపెనీ వృద్ధి చూస్తే, రుణాల బాధ లేకపోవడంతో పాటు, చక్కటి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో కంపెనీకి కలిసివచ్చే అంశం. అలాగే బలమైన ఆర్డర్ బుక్ కూడా జీఎంఎంకు అదనపు బలాన్ని చేకూర్చుతోంది. ఆనంద్ రాఠీ లాంటి మార్కెట్ బ్రోకింగ్ సంస్థలు GMM Pfaudler సంస్థ టార్గెట్ రూ.1849 సెట్ చేయడం గమనార్హం. అలాగే అటు మార్కెట్ పరంగా చూసినా ఆగ్రో, స్పెషాలిటీ కెమికల్స్ మార్కెట్లో సుమారు 60 శాతం వాటా GMM Pfaudler సొంతమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Disclaimer: The views and investment tips expressed by investment experts on news18 telugu are his own and not that of the website or its management. news18 telugu advises users to check with certified experts before taking any investment decisions.
Disclaimer: The views and investment tips expressed by investment experts on news18 telugu are his own and not that of the website or its management. news18 telugu advises users to check with certified experts before taking any investment decisions.
వాషింగ్ మెషీన్ కొనాలా? Whirlpool Ace XL మోడల్‌ను పరిశీలించండి
Salary Hike: గుడ్ న్యూస్... వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు
జియో సినిమా యూజర్లకు బంపర్ ఆఫర్...సన్‌నెక్ట్స్ సినిమాలన్నీ చూసే చాన్స్...
ఆన్లైన్లో కెమెరా ఆర్డర్ ఇస్తే... ఏం వచ్చిందో తెలుసా...?
లక్ష కోట్లు దాటి జీఎస్టీ వసూళ్లు...కేంద్రానికి ఊరట...
కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు షాక్...ట్రేడింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసిన ఎన్ఎస్ఈ
Loading...