Kisan Vikas Patra | మీరు డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? బ్యాంకుల్లో అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే బ్యాంకుల్లో (Banks) కన్నా పోస్టాఫీస్ (Post Office) స్కీమ్స్‌లో అధిక రాబడి పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం ఉంది. ఇందులో బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా అధిక వడ్డీ పొందొచ్చు.
ఈ పథకంలో కనీసం రూ.1000 నుంచి డబ్బులు దాచుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే రూ. 50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన భావిస్తే.. మాత్రం పాన్ కార్డు కలిగి ఉండాలి. ఈ పథకంలో డబ్బులు పెడితే 123 నెలల్లో రెట్టింపు అవుతాయి. అంటే పేదళ్ల మూడు నెలల్లో డబ్బులు డబుల్ అవుతాయని చెప్పుకోవచ్చు.
నేటి నుంచి కొత్త రూల్స్.. మారే 12 అంశాలు ఇవే.. మీపై ఎఫెక్ట్!
ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర పథకంలో 7 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే ఈ వడ్డీ రేటు అనేది మారుతూ ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్తుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు. లేదంటే తగ్గొచ్చు. ఇవి రెండూ కాకపోతే స్థిరంగా కూడా ఉండొచ్చు. అందువల్ల వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. కొత్త రేట్లు ఇలా, వారికి మొండి చెయ్యి!
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఫిక్స్డ్ డిపాజిట్లపై పోలిస్తే ఈ స్కీమ్‌పై అధిక వడ్డీ ఉందని చెప్పుకోవచ్చు. 2 నుంచి 3 ఏళ్ల టెన్యూర్‌లోని ఎఫ్డీలపై 6.25 శాతం, 5 నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై 6.9 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో భారతీయ పౌరులు ఎవరైనా చేరొచ్చు. 18 ఏళ్లకు పైన వయసు ఉండాలి.
కాగా ఈ స్కీమ్ లాకిన్ పీరియడ్ 30 నెలలు. అంటే రెండున్నర ఏళ్లు దాటిన తర్వాత పెట్టిన డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఈ లాకిన్ పీరియడ్ కన్నా ముందే డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. మాత్రం పెనాల్టీ పడుతుంది. అందువల్ల డబ్బులు పెట్టే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. డబ్బులు రెట్టింపు అవ్వాలని భావిస్తే.. మాత్రం పదేళ్ల వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోకూడదు. కాగా ఈ స్కీమ్‌పై ఇతర పథకాల మాదిరిగా పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FD rates, Fixed deposits, Kisan vikas patra, Personal Finance, Post office, Post office scheme, Sbi