హోమ్ /వార్తలు /బిజినెస్ /

ఆర్కా సావి గులాబీ సాగుతో 15 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం.., ఎలా సాగు చేస్తారు..?

ఆర్కా సావి గులాబీ సాగుతో 15 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం.., ఎలా సాగు చేస్తారు..?

X
అనకాపల్లిలో

అనకాపల్లిలో గులాబీలు పండిస్తున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి

పువ్వులోనే గులాబీ పువ్వు (Roses) ఎంతో ప్రత్యేకం. మహిళల మనుసు దోచే గులాబీలు ప్రపంచమంతటా కనిపిస్తూనే ఉంటాయి. అదే సమయంలో వాణిజ్యపరంగా గులాబీల సాగులో ఉన్న లాభాలను ఇప్పుడిప్పుడే రైతులు గమనిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anakapalle, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

పువ్వులోనే గులాబీ పువ్వు (Roses) ఎంతో ప్రత్యేకం. మహిళల మనుసు దోచే గులాబీలు ప్రపంచమంతటా కనిపిస్తూనే ఉంటాయి. అదే సమయంలో వాణిజ్యపరంగా గులాబీల సాగులో ఉన్న లాభాలను ఇప్పుడిప్పుడే రైతులు గమనిస్తున్నారు. దీంతో గులాబీ సాగు గురించి మెళుకువలు తెలుసుకుని ఆదిశగా రైతులు దృష్టి సారిస్తున్నారు. అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నం మండలం ఏటిగైరంపేట గ్రామంలో రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయి రామారావు ఓ ప్రత్యేక గులాబీ జాతి మొక్కలను సాగు చేస్తున్నారు. ఆర్కా సావి అని పిలిచి ఈ రకం గులాబీ జాతి ఇప్పుడు ఇతర రైతుల దృష్టిని ఆకర్షిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు దగ్గర గ్రామీణ ప్రాంతం రామారావుది. నర్సీపట్నంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ మేనేజర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు.

మొదట్నుంచి రామారావుది వ్యవసాయ కుటుంబం కావడంతో పదవీ విరమణ అనంతరం తాను కూడా వ్యవసాయ మీద దృష్టిపెట్టాడు. ఏటిగైరంపేట గ్రామంలో 15 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం ప్రారంభించారు. అందులో భాగంగా ఆర్కా సావి గులాబీ పంటను వేశాడు రామారావు. ప్రత్యేకించి ఈ రకం గులాబీలను సాగు చేయడం వెనుక కారణం ఉంది. ఆర్కా సావి జాతి గులాబీలను అలంకరణల్లో విరివిగా వాడుతుంటారు. మొక్క నుండి వేరు చేసిన అనంతరం 7 రోజుల పాటు పువ్వు వాడి పోకుండా ఉండడం దీని ప్రత్యేకత. భారతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ, బెంగళూరు వారు ఈ పువ్వులపై పరిశోధన జరిపారు. అనంతరం దేశి వెరైటీ మీద అభివృద్ధి చేసి ఉత్పత్తి నిమిత్తం విడుదల చేశారు. ఈ మొక్క జాతి పేరు ఆర్కా సావి.

ఇది చదవండి: కూరగాయల సాగులో రైతు కుటుంబం.., ఇలా చేస్తే లాభాలే తప్ప నష్టాలు ఉండవు

ఈ గులాబీ సాగులో పువ్వు కోతకు వచ్చే నాటికి ఎకరానికి 30 టన్నుల వరకు దిగుబడి ఇస్తుందని రామారావు వివరించారు. దానితో పాటు 15 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర రోజా పూలు ఏడురోజుల షెల్ఫ్ లైఫ్ ఉండదు. కానీ ఈ ఆర్కా సావి రోజా పువ్వు మాత్రం వారం పాటు వాడి పోకుండా ఉంటుంది.

ఇది చదవండి: వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు పండిస్తున్న రైతు.. రోజుకు రూ.3వేలు లాభం..

సాగు విధానం: రైతులు ఒక ఎకరానికి 15 టన్నుల ఫార్మ్ యాడ్ మ్యాన్ యువర్ బాగా వేసుకొని కలియ దున్నుకోవాలి. మొక్కలు ఒకటిన్నర అడుగుల నుండి రెండు అడుగుల వెడల్పు నిర్మించాలి. ఒక్కో మొక్క నుండి ఒక్కో మొక్కకు మూడ అడుగులు వరుస నుండి ఆరడుగుల వ్యత్యాసంలో గులాబీ మొక్కలు నాటుకోవాలి. మొక్క నాటిన రెండు నెలల నుండే ఈ గులాబీ పూలు పూస్తాయి. అయితే వచ్చిన మొగ్గలను ఆరు నెలల వరకు తుంచేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన తక్కువ కాలంలోనే మొక్క బలంగా తయారవుతుంది.

ఇది చదవండి: ఒక్కసారి నాటితే 20 ఏళ్ల దిగుబడి..! నష్టమేరాని పంటలు..! ఈ రైతు ఏం పండిస్తున్నాడంటే..!

ఈ గులాబీ ప్రస్తుత కనీస ధర 50 రూపాయలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కో రైతుకు సంవత్సర కాలంలో రూ. 15 లక్షల ఆదాయం రాబట్టుకోవచ్చని రామారావు తెలిపారు. ఏడాదికి కూలీలకు గాను రూ. 3 లక్షలు ఖర్చు అవుతుండగా సంవత్సర కాలంలో గులాబీ రైతు రూ. 12 లక్షల ఆదాయాన్ని గడించ వచ్చని ఆయన అన్నారు.

ఎలా వెళ్లాలి: విశాఖపట్నం కాంప్లెక్స్ నుండి బస్సులో నర్సీపట్నం చేరుకోవాలి. అక్కడ నుండి ఏటిగైరంపేట గ్రామానికి చేరుకుంటే స్థానికంగా గ్రామస్థులను అడిగి ఈ తోటకు చేరుకోవచ్చు. ఫోన్ నంబర్: 99121 89524.

First published:

Tags: Agriculture, Andhra Pradesh, Business Ideas, Local News, Visakhapatnam