Fixed Deposit | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన సౌత్ ఇండియన్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్‌లో (Bank) డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇలాంటి వారికి అధిక రాబడి వస్తుంది. బ్యాంక్ తాజాగా రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలపై (FD)వడ్డీ రేట్లు పెంచేసింది.
బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. వడ్డీ రేట్లు పెంపు జనవరి 20 నుంచే అమలులోకి వచ్చింది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 2.65 శాతం నుంచి 6 శాతం వరకు ఉంది. సాధారణ కస్టమర్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ రేటు 3.15 శాతం నుంచి 6.5 శాతం వరకు వస్తుంది. బ్యాంక్ గరిష్టంగా రెగ్యులర్ కస్టమర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.
రైతుల అకౌంట్లలోకి డబ్బులు.. జనవరి 28లోపు ఇలా చేస్తేనే..
7 రోజుల నుంచి 30 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 2.65 శాతంగా ఉంది. 31 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 3.25 శాతం కొనసాగుతోంది. 91 రోజుల నుంచి 99 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.25 శాతంగా ఉంది. 100 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతంగా కొనసాగుతోంది. 101 రోజుల నుంచి 180 రోజుల ఎఫ్‌డీలపై 4.25 శాతం వడ్డీ వస్తుంది. 181 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై అయితే 4.6 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. ఏడాది ఒక్క రోజు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది.
ఏడాది 2 రోజుల నుంచి 30 నెలల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7 శాతంగానే ఉంది. 30 నెలల నుంచి ఐదేళ్ల టెన్యూర్‌లో వడ్డీ రేటు 6.5 శాతంగా కొనసాగుతోంది. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును పెంచుకుంటూ వెళ్లడం ఇందుకు కారణం. దీంతో బ్యాంకులు వరుసపెట్టి వడ్డీ రేట్లను పెంచుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచేశాయి. ఎస్‌బీఐ , ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా చాలా బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అలాగే రుణ రేట్లు కూడా పెరిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, FD rates, Fixed deposits, Money