THIS MULTIBAGGER STOCK MADE 15 LAKHS WORTH RS 1 LAKH IN JUST ONE YEAR MK
Kwality Pharmaceuticals ltd: జస్ట్ ఒక సంవత్సరంలో రూ.1 లక్షను రూ.15 లక్షలుగా మార్చిన స్టాక్ ఇదే..
ప్రతీకాత్మకచిత్రం
స్టాక్ క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (kwality pharmaceuticals ltd.) ఈ పెన్నీ స్టాక్ సరిగ్గా ఏడాది క్రితం సుమారు రూ.50 ట్రేడ్ అవగా ఏకంగా, ప్రస్తుతం రూ.780 వద్ద ట్రేడవుతోంది. గత సంవత్సరం నుంచి ఈ స్టాక్ మదుపుదారులకు 1,178 శాతం రాబడిని అందించింది.
Kwality Pharmaceuticals ltd : గత సంవత్సరం స్టాక్ మార్కెట్ లో చాలా స్టాక్స్ మల్టీ బ్యాగర్లుగా లాభాలను అందించాయి. కొన్నిలార్జ్ క్యాప్ స్టాక్స్ సైతం మంచి లాభాలను అందించగా, మల్టీ బ్యాగర్లలో మాత్రం పెన్నీ స్టాక్స్ రేసు గుర్రాల్లా పరిగెత్తాయి. చాలా వరకూ పెన్ని స్టాక్‌లు తక్కువ వ్యవధిలో భారీ రాబడిని ఇచ్చాయి. అలాంటి స్టాక్స్ ఇండెక్స్ లో గుర్తించడం చాలా కష్టం. అయినప్పటికీ ఫండమెంటల్స్ బలంగా ఉంటే పెన్సీ స్టాక్స్ కూడా మంచి రాబడిని అందిస్తాయి. అటువంటి స్టాక్ క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (kwality pharmaceuticals ltd.) ఈ పెన్నీ స్టాక్ సరిగ్గా ఏడాది క్రితం సుమారు రూ.50 ట్రేడ్ అవగా ఏకంగా, ప్రస్తుతం రూ.780 వద్ద ట్రేడవుతోంది. గత సంవత్సరం నుంచి ఈ స్టాక్ మదుపుదారులకు 1,178 శాతం రాబడిని అందించింది.
క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (kwality pharmaceuticals ltd.) స్టాక్ గతేడాది మార్చి 24న రూ.49.10గా ఉంది. అప్పటి నుంచి ఈ స్టాక్ నిరంతరం పెరుగుతూనే ఉంది. మే నెలలో రూ.100 స్థాయిని దాటాయి. నవంబర్ నెలలో క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ స్టాక్ అత్యధికంగా రూ.1066కి చేరుకుంది. ఆ తర్వాత అందులో కొంత కరెక్షన్ కనిపించింది. ప్రస్తుతం క్వాలిటీ ఫార్మా షేరు రూ.779.85 వద్ద ట్రేడవుతోంది.
kwality pharmaceuticals ltd.స్టాక్‌లో గత ఏడాది రన్ అధ్యయనం చేస్తే, గత సంవత్సరం మార్చిలో ఒక పెట్టుబడిదారుడు రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి దానిలో సుమారు 2000 షేర్లను కొనుగోలు చేస్తే, ఈ రోజు వాటి ధర 15 లక్షలుగా మారేవి. గత 6 నెలల్లో ఈ ఫార్మా స్టాక్ ఈ కాలంలో దాదాపు 320 శాతం వృద్ధితో రూ.183 నుంచి 779.85 స్థాయికి చేరుకుంది. ఒక ఇన్వెస్టర్ 6 నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అతని 1 లక్ష ఈ రోజు దాదాపు రూ. 4.30 లక్షలుగా మారి ఉండేవి. గత రెండు సంవత్సరాల రాబడి గురించి మాట్లాడినట్లయితే, డిసెంబర్ 26, 2019 న, BSEలో దీని ధర రూ. 25.55. ఇది ఇప్పుడు రూ. 779.85. ఈ రెండేళ్లలో దాదాపు 2900 శాతం జంప్ నమోదైంది. ఈ రెండేళ్ల కాలంలో దాదాపు 30 రెట్లు పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.