• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • THIS IS WHY YOUR IN HAND SALARY WILL DOWN FROM APRIL 2020 MK GH

Take Home Salaries: ఉద్యోగులందరికీ షాక్ ఏప్రిల్ 2021 నుంచి అందరి జీతంలో కోత...ఎందుకో తెలుసా...

Take Home Salaries: ఉద్యోగులందరికీ షాక్ ఏప్రిల్ 2021 నుంచి అందరి జీతంలో కోత...ఎందుకో తెలుసా...

ప్రతీకాత్మకచిత్రం

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరిని కుదిపేసింది. ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభానికి నెట్టేసింది. ఈ ఏడాది కరోనా లాక్ డౌన్(Corona Lockdown) కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల వేతనం(Salaries)లో కోతను విధించాయి.

  • Share this:
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరిని కుదిపేసింది. ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభానికి నెట్టేసింది. ఈ ఏడాది కరోనా లాక్ డౌన్(Corona Lockdown) కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల వేతనం(Salaries)లో కోతను విధించాయి. అంతేకాకుండా వ్యాపారాలు, ఇతర కార్యకాలపాల్లో పనిచేసే వారి చేతికి వచ్చే నికర ఆదాయాన్ని కూడా కొత పెట్టాయి. తాజాగా ఇంటికి వచ్చే వేతనం(Take Home Salaries) కూడా తగ్గనుంది. అవును 2021 ఏప్రిల్ నుంచి నూతన వేతన నియమాలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రకారం సంస్థలు తమ సిబ్బంది ప్యాకేజీలపై కోత విధించనున్నాయి. అయితే వీటి స్థానంలో భవిష్యనిధి(Providen Fund), గ్రాట్యూటీ(Gratuity) పెరగనున్నాయి.

ఈ సరికొత్త వేతన నియమాల ప్రకారం మొత్తం జీతంలో అలవెన్సులన్నీ(Allowances) కలిపి 50 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. దీని ప్రకారం ఏప్రిల్ 2021 నుంచి బేసిక్ పే(Basic Pay) 50 శాతం లేదా దాని కంటే ఎక్కువ ఉంటుంది. సాధారణంగా యజమానులు ఉద్యోగుల జీతంలో అలవెన్సేతర(Non Allowance) వేతనాలను 50 శాతం కంటే తక్కువ ఉంచుతారు. ఫలితంగా ఉద్యోగులకు అధిక వేతనం లభిస్తుంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యజమానులు.. ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని(Basic Pay) పెంచాల్సిన అవసరముంది. గ్రాట్యూటీ(Gratuity) చెల్లింపులు పెరగడం, భవిష్యనిధులకు ఉద్యోగుల సహకారం కారణంగా టేక్ హోమ్ జీతాలు(Take Home Salries) తగ్గుతాయి.

ప్రావిడెంట్ ఫండ్ వాటా అనేది ప్రాథమిక జీతం శాతంగా లెక్కించబడుతుంది. వేతన నియమావళి-2019 ముసాయిదా నియమాల ప్రకారం "గ్రాట్యూటీ, ప్రావిడెంట్ విరాళాలను లెక్కించడానికి వేతనాలు ఉద్యోగుల మొత్తం వేతనం లేదా పరిహారంలో కనీసం 50 శాతం ఉండాలి" అని పేర్కొంది.

PF, గ్రాట్యూటీ పట్ల పెరిగిన సహకారాన్ని సమతూల్యం చేయడానికి కంపెనీలు భత్యం దామాషా కోతను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. గత ఏడాది జులై 30న లోక్ సభలో, ఆగస్టు 2న రాజ్యసభలో ఆమోదించిన వేతనాల బిల్లు-2019(Wages Bill), జీతాలు, బోనస్(Bonus)తో అనుసంధానించిన విషయాలకు సంబంధించిన చట్టాలను సవరించడానికి, ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తుంది. కోత వేతన నియమాల ప్రకారం కనీస వేతనాల చట్టం(Minimus Wages Act), బోనస్ చెల్లింపులు(Bonus Payments), సమానవేతన చట్టం అనే నాలుగు కార్మీక చట్టాలను పొందుతాయి. వేతన నియమావళి-2019 అమలు చేసిన తర్వాత ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఎక్కువ డబ్బు ఆదా చేయడానికి సహాయపడుతుంది.
Published by:Krishna Adithya
First published: