పెట్టుబ‌డికి స‌రైన మార్గం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్ర‌స్తుతం మ్యూచువ‌ల్ ఫండ్‌లో పెట్టుబ‌డి పెట్టే వారికి సిప్ ఇన్వెస్ట్ మెంట్ స‌రైన మార్గ‌మ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. త‌క్కువ మొత్తంలో నిరంతరం పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల అధిక లాభాలు పొంద‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు.

 • Share this:
  ప్రస్తుతం కొత్త‌గా సంపాదిస్తున్న వారికి పెట్టుబ‌డి పెట్ట‌డానికి మార్కెట్‌లో మంచి స్కీమ్‌లు ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా మ్యూచువ‌ల్ ఫండ్‌ల‌లో సిస్ట‌మెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌) చేయ‌డం వ‌ల్ల మంచి లాభాలు గ‌డించ‌వ‌చ్చు. త‌క్కువ మొతాదులో చిన్న‌చిన్న పెట్టుబ‌డుల‌తో ఎక్కువ లాభం పొందే అవ‌కాశం సిప్ ద్వారానే ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం యువ‌త సిప్ ద్వారానే ఎక్కువ ఆదాయం పొందగ‌ల‌ర‌ని చెబుతున్నారు.
  ఎవ‌రైతే ఎక్కువ పెట్టుబ‌డులు ఆశిస్తారో వారికి మ్యూచువ‌ల్ ఫండ్‌లో సిప్ పెట్టుబ‌డి స‌రైన వేదిక అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒకే సారి పెద్ద పెట్టుబ‌డి పెట్ట‌డం కంటే చిన్న మొత్తంలో పెట్టుబ‌డి పెట్టుకోవ‌డం వేత‌న వ‌ర్గాల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంది కూడా. సిప్‌లో పెట్టిన పెట్టుబ‌డి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.
  సిప్ అనేది దీర్ఘ‌కాలం పెట్టుబ‌డి పెట్టే వారికి అద్భుత‌మైన ఆదాయ వ‌న‌రు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెట్టిన పెట్టుబ‌డికి మంచి లాభం పొందవ‌చ్చ‌ని పేర్కొంటున్నారు. ఉద్యోగ వ‌ర్గాల‌కు, నిరంత‌రం ఆదాయం వ‌చ్చే వారికి ప్ర‌స్తుతం మార్కెట్‌లో సిప్‌లో పెట్టుబ‌డి మేల‌ని చెబుతున్నారు. 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో స‌రైన ఇన్వెస్ట్ మెంట్ చేస్తే 50 ఏళ్ల వ‌య‌సుకు వ‌చ్చే స‌రికి రూ.10 కోట్లు సంపాదించ‌వ‌చ్చ‌ని ట్రాన్స్‌సెండ్ కన్సల్టెంట్స్ కార్తిక్ జావేరి సూచిస్తున్న‌ట్టు మింట్ వెల్ల‌డించింది.
  మ్యూచ్‌వ‌ల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయ‌డం ద్వారా త‌క్కువ‌లో త‌క్కువ 12శాతం లాభం పొంద‌వ‌చ్చ‌ని కార్తీక్ చెబుతున్నారు. మ్యూచ్‌వ‌ల్ ఫండ్ క్యాలిక్యులేట‌ర్ ప్ర‌కారం 25 ఏళ్ల వ‌య‌సులో సిప్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా నెల‌కు రూ.15,000 పెట్టుబ‌డిగా పెడితే 50 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు సుమారు. రూ.10.19 కోట్లు వ‌స్తాయ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
  Published by:Sharath Chandra
  First published: