హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Health Gain Policy: పాలసీబజార్ పోర్టల్‌లో రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీ లాంచ్‌.. దీని ఫీచర్లు ఇవే..

Reliance Health Gain Policy: పాలసీబజార్ పోర్టల్‌లో రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీ లాంచ్‌.. దీని ఫీచర్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో టాప్‌ హెల్త్ ఇన్సూరెన్స్‌ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి మరో కొత్త పాలసీ లాంచ్ అయింది. పాలసీబజార్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీని సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియాలో టాప్‌ హెల్త్ ఇన్సూరెన్స్‌ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ (Reliance General Insurance) నుంచి మరో కొత్త పాలసీ లాంచ్ అయింది. పాలసీబజార్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ (Policybazaar’s online platform) లో రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీ (Reliance Health Gain Policy) ని సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ పాలసీని మే నెలలోనే కంపెనీ లాంచ్‌ చేసింది. రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీ ఫీచర్లు, ప్రయోజనాల కారణంగా కస్టమర్ల నుంచి ఆదరణ లభించింది. ఇందులో అవసరాలకు అనుగుణంగా హెల్త్‌ పాలసీని మార్చుకునే అవకాశం కస్టమర్లకు ఉంది. అందరికీ పాలసీని చేరువ చేయాలనే ఉద్దేశంతో పాలసీబజార్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌లో పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీ అనేది పరిశ్రమలో అత్యంత సౌకర్యవంతమైన హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్స్‌లో ఒకటి. ఇది ప్లస్, పవర్, ప్రైమ్ అనే మూడు ప్లాన్‌లలో అందుబాటులో ఉంది. ప్రతి కస్టమర్ పాలసీని కస్టమైజ్‌ చేసుకునే అవకాశం ఉంది. భారతదేశంలో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్‌ వాటా GDPలో 1 శాతంగా ఉందన్నారు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేష్ జైన్. ఇది ప్రపంచ సగటు 4.1 శాతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. భారతదేశంలోని ఫిన్‌టెక్ ఎకో సిస్టమ్ సాయంతో ఈ లోటును అధిగమించే అవకాశం ఉందని తెలిపారు.

LIC New Pension Plus Plan: ఎల్‌ఐసీ న్యూ పెన్షన్‌ ప్లస్‌ ప్లాన్‌ లాంచ్‌.. ప్రీమియం, ఫండ్స్‌, ప్లాన్ రూల్స్ ఇవే..

పాలసీ ఫీచర్లు

రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీ 38 టాప్‌ ఫీచర్లను అందిస్తుంది. ఈ డబుల్‌ కవర్‌ ఫీచర్‌ ద్వారా క్లెయిమ్ సమయంలో అందాల్సిన బీమా మొత్తం కంటే రెట్టింపు మొత్తాన్ని కస్టమర్లు అందుకుంటారు. పాలసీ ఇయర్‌లో ఎన్నిసార్లు లిమిట్‌ అయిపోయినా అపరిమితంగా లిమిట్‌ను రెన్యువల్ చేసుకునే సదుపాయం ఉంది. క్లెయిమ్ తర్వాత క్యుములేటివ్‌ బోనస్ నష్టపోకుండా గ్యారెంటీడ్ క్యుములేటివ్ బోనస్ ఫీచర్‌ కూడా ఉంటుంది. అలానే ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీజ్‌ వెయిటింగ్‌ పీరియడ్‌ను మూడు సంవత్సరాల నుంచి రెండు లేదా ఒక సంవత్సరానికి తగ్గించుకోవచ్చు.

కస్టమర్లకు స్వేచ్ఛ

తమ సంస్థ ఎల్లప్పుడూ కస్టమర్లకు అత్యుత్తమ సేవలందించే వినూత్న ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుందన్నారు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేష్ జైన్. పాలసీబజార్‌లో రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీని అందించడం వల్ల, ఇది ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కలిగిందన్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ఎంపికలో, అవసరాలకు అనుగుణంగా మార్చుకునే సదుపాయాలతో కస్టమర్లకు స్వేచ్ఛను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తమ ప్రయోజనాలతో మంచి డిమాండ్‌ సొంతం చేసుకున్న పాలసీని ఇప్పుడు డిజిటల్‌ వేదికపై అందుబాటులోకి తీసుకురావడంపై రాకేస్‌ జైన్ ఆనందం వ్యక్తం చేశారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: General insurance, Health Insurance

ఉత్తమ కథలు