Home /News /business /

THIS INSURANCE COMPANY ACHIEVES HIGHEST CLAIM SETTLEMENT RATIO MK GH

Max Life Insurance: కరోనా సమయంలో మాక్స్​లైఫ్​ ఇన్సూరెన్స్​ సరికొత్త రికార్డు.. 99.35 శాతం డెత్​ క్లెయిమ్​ల పరిష్కారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ .885.57 కోట్ల విలువైన 19,922 డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ ప్రకటించింది. తద్వారా, కంపెనీ 99.35% పర్సనల్ డెత్ క్లెయిమ్స్ పెయిడ్​ రేషియోను సాధించినట్లు పేర్కొంది.

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి కారణంగా ఇన్సూరెన్స్​ పాలసీలకు భారీ డిమాండ్​ ఏర్పడింది. ఇదే క్రమంలో కరోనా కేసులు, మరణాలు పెరగడంతో​ క్లెయిమ్​ల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. అయితే, పాలసీదారులు సకాలంలో ప్రీమియంలను చెల్లించినప్పటికీ, కొన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు అనేక సాకులు చూపిస్తూ క్లెయిమ్​లను తిరస్కరించాయి. ఈ మేరకు పాలసీదారుల నుంచి ఐఆర్​డీఏఐకి పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. అయితే, ప్రముఖ భీమా సంస్థ మాక్స్​ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం ఎక్కువ క్లెయిమ్​లను పరిష్కరించి పారదర్శక సంస్థగా నిలిచింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ .885.57 కోట్ల విలువైన 19,922 డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ ప్రకటించింది. తద్వారా, కంపెనీ 99.35% పర్సనల్ డెత్ క్లెయిమ్స్ పెయిడ్​ రేషియోను సాధించినట్లు పేర్కొంది.

మాక్స్​ లైఫ్​ సంస్థ 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 562 కోట్ల రూపాయల విలువైన పర్సనల్​ క్లెయిమ్‌లను పరిష్కరించింది. వేగవంతమైన క్లెయిమ్​ సెటిల్​మెంట్​కోసం రోబస్ట్​ ఫ్రాడ్​ మేనేజ్​మెంట్​ మోడల్​ను అనుసరించింది. దీనిపై మాక్స్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ త్రిపాఠి మాట్లాడుతూ,“క్లెయిమ్​ పరిష్కారంలో ఈ కొత్త బెంచ్ మార్క్​ సాధించినందుకు గర్వంగా ఉంది. కస్టమర్ల నమ్మకమే మా వ్యాపారానికి మూలస్తంభం. అందుకే, కరోనా విపత్కర సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డెత్​ క్లెయిమ్​లను పరిష్కరించాం. తద్వారా, అత్యధిక డెత్​ క్లెయిమ్​ రేషియోను సాధించగలిగాం. కేవలం ఒక సంవత్సరంలోనే ఈ ఘనత సాధించడం నిజంగా మాకు ప్రత్యేకమైనది. మరింత సులభతమైన, వేగవంతమైన క్లెయిమ్​ పరిష్కారం కోసం డిజిటల్‌ విధానంపై దృష్టి సారించాం. దీనితో కస్టమర్లు సమయానికి క్లెయిమ్‌లను సమర్పించడమే కాకుండా, ఫిజికల్​ డాక్యుమెంట్​ ప్రాసెస్​ను కూడా తగ్గించవచ్చు.” అని అన్నారు.

పేపర్​లెస్​, కాంటాక్ట్​ లెస్​ సర్వీస్​..
గత ఐదు సంవత్సరాలుగా మాక్స్ లైఫ్ తన క్లెయిమ్స్ సెటిల్​మెంట్​ రేషియోని మెరుగుపరుచుకుంటూ వస్తోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 99% క్లెయిమ్​ సెటిల్​మెంట్​ మార్కును అధిగమించింది. సంస్థ ప్రారంభమైన నాటి నుంచి మార్చి 21 వరకు మొత్తం 1,32,868 పాలసీలకు డెత్​ క్లెయిమ్‌ చేసింది. దీని కింద మొత్తం రూ .4123.57 కోట్లు మేర పాలసీదారులకు చెల్లించినట్లు మాక్స్​ లైఫ్​ ఇన్సూరెన్స్​ సంస్థ స్పష్టం చేసింది. కాంటాక్ట్‌లెస్, పేపర్‌లెస్ సర్వీసులను అందించడానికి మాక్స్ లైఫ్ సంస్థ డిజిటల్ సర్వీసింగ్ కార్యక్రమాలను బలోపేతం చేసింది. దీనిలో భాగంగా వాట్సాప్‌ ద్వారా AI- ఆధారిత చాట్‌బాట్​ను కూడా ప్రవేశపెట్టింది. తద్వారా, క్లెయిమ్​ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Insurance

తదుపరి వార్తలు