హోమ్ /వార్తలు /బిజినెస్ /

Electric Scooters: దీపావళి బోనస్​గా ఉద్యోగులకు ఎలక్ట్రిక్​ స్కూటర్లు.. ఆ కంపెనీ కీలక నిర్ణయం..

Electric Scooters: దీపావళి బోనస్​గా ఉద్యోగులకు ఎలక్ట్రిక్​ స్కూటర్లు.. ఆ కంపెనీ కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Electric Scooters: దీపావళి, దసరా పండుగల సందర్భంగా అనేక కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తూ ఉంటాయి. చాలా కంపెనీలు నగదు రూపంలోనే బోనస్ అందిస్తాయి. అయితే గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఎలియన్స్​ గ్రూప్ సంస్థతమ ఉద్యోగులకు ఏకంగా విద్యుత్ ఛార్జింగుతో నడిచే స్కూటర్లను బోనస్ గా అందించింది.

ఇంకా చదవండి ...

దీపావళి, దసరా పండుగల సందర్భంగా అనేక కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తూ ఉంటాయి. చాలా కంపెనీలు నగదు రూపంలోనే బోనస్ అందిస్తాయి. అయితే గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఎలియన్స్​ గ్రూప్ సంస్థతమ ఉద్యోగులకు ఏకంగా విద్యుత్ ఛార్జింగుతో నడిచే స్కూటర్లను బోనస్ గా అందించింది. ఎంబ్రాయిడరీ యంత్రాలు తయారు చేసే ఎలియన్స్ గ్రూపు వారి ఉద్యోగులకు దీపావళి బోనస్ గా ఈవీ స్కూటర్లు అందించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకినావా ప్రైసీప్రో కంపెనీకి చెందిన రూ.76,848 విలువైన విద్యుత్ స్కూటర్లను ఎలియన్స్ గ్రూపు వారి ఉద్యోగులకు అందించింది.

Diwali Offer: దీపావళి బంపరాఫర్.. సేవింగ్స్​ అకౌంట్​పై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు.. వివరాలివే..


నిత్యం పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎలియన్స్ గ్రూపు డైరెక్టర్ సుభాష్ దవార్ తెలిపారు.ఇది కేవలం మీడియాలో హెడ్ లైన్స్ వార్తగా రావడం మాత్రమే కాదు, కంపెనీ ఆర్థిక నిర్ణయాలను ఇది ప్రభావితం చేస్తుంది. కేవలం ఉద్యోగులకు ఇంధన ఖర్చులు తగ్గించడమే కాదు, విద్యుత్ వాహనాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ రక్షణకు కంపెనీ తీసుకున్న నిర్ణయం దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పర్యావరణం బాగుంటేనే అందరూ బాగుంటారు. అలాగే కంపెనీ కూడా. పర్యావరణ రక్షణకు అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయడానికి మేం ప్రయత్నిస్తామనిఎలియన్స్ గ్రూపు డైరెక్టర్ సుభాష్ దవార్ చెప్పారు.

Free Ration: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఉచిత రేషన్ మరో ఆరు నెలలు పొడిగింపు..


సుభాష్ దవార్ గురించి క్లుప్తంగా...

సుభాష్ దవార్ చిరాగ్ దవార్ తనయుడు. చిరాగ్ తరవాత వ్యాపారం చేతిలోకి తీసుకున్నారు. ఈ దీపావళికి 35 మంది ఉద్యోగులకు విద్యుత్ స్కూటర్లు దీపావళి బోనస్ గా ఇవ్వడం ద్వారా ఆయన ఉదారత చాటుకున్నారు. దేశంలో లక్షలాది కంపెనీలు కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులకు దసరా బోసన్ అందిస్తున్నాయి. కాని దీపావళి బోనస్ గా విద్యుత్ స్కూటర్లు ఇవ్వడం ద్వారా సుభాష్ వార్తల్లో నిలిచారు.

Lucky: పండుగ పూట అదృష్టం అంటే వీళ్లదే.. ఎంత అంటే.. ఇది చూస్తే మీకే అర్థం అవుతుంది..


పెరుగుతున్న కాలుష్యానికి చెక్​ పెట్టేందుకు..

పెరిగిపోతున్న భూతాపం, పర్యావరణ సమస్యలకు కాలుష్యం ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇదే విధంగా కాలుష్యం పెంచుకుంటూ పోతే వాతావరణంలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే భూ మండలంలో అనేక చిన్న దీవులతోపాటు, తీర ప్రాంతంలో ఉన్న 30 ప్రధాన పట్టణాలు కూడా సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అందుకే సాధ్యమైనంత మేర కాలుష్యం తగ్గించే ఇంధనాలను ప్రోత్సహించాలని, 2070 నాటికి మనదేశం జీరో పొల్యూషన్ ఇంధనాలు వాడుతున్న దేశంగా మార్చడానికి హామీ ఇస్తున్నట్టు ప్రధాని మోదీ ఇటీవల గ్లాస్గో లో జరిగిన పర్యావరణ సదస్సులో ప్రకటించారు.

Published by:Veera Babu
First published:

Tags: Bumper offer, Diwali 2021, Electric Vehicle, New electric bike

ఉత్తమ కథలు